గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఫిబ్రవరి 2017, గురువారం

నవాక్షర సమవృత్త, - కంద త్రయ, - మణిగణనికర(శశికళా)వృత్త - గర్భిత సరసిజ వృత్తము . . రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
సరసిజ
నవాక్షర సమవృత్త, - కంద త్రయ, - మణిగణనికర(శశికళా)వృత్త - గర్భిత సరసిజ వృత్తము: *
[లక్షణము: మ - - - - - - - స... గణములుండును.
యతి:1-10-18 యక్షరములకు... ప్రాసపాటింపఁబడును]
భావావేశోద్భాస ప్రభావా
దేవీ దుర్గా! దీపిత ధీవై
నీ వానిన్ నన్ నేర్పున నీవే
కావన్ వచ్చే భద్రవు కావా?
సరసిజ
నవాక్షర సమవృత్త, కంద త్రయ, మణిగణనికర(శశికళా)వృత్త గర్భిత సరసిజ వృత్తము: *
[లక్షణము: మ - - - - - - - స... గణములుండును.
యతి:1-10-18 యక్షరములకు... ప్రాసపాటింపఁబడును]
ప్రావీణ్యా నా రక్షక రావా భవ భయ హరణుఁడ! వర మగు భవుఁడా!
భావాతీతా! భవ్య ప్రభావా! ప్రవిమల చరితుగ వరలఁ గనుము నన్.
జీవేశా! నా చింతయు, సేవల్, శివ పద భరణము కృతికి పతివయే
దేవా నీ యందే గురుదేవా! దివిజ భరణ! హర! తెలియుము కృతిలోన్
1. సరసిజ వృత్త గర్భిత నవాక్షర వృత్తము: - గణములు. యతి 1- 5
ప్రావీణ్యా నా రక్షక రావా!
భావాతీతా! భవ్య ప్రభావా!
జీవేశా! నా చింతయు, సేవల్,
దేవా నీ యందే గురుదేవా!
2. సరసిజ వృత్త గర్భిత కందము(1)
ప్రావీణ్యా నా రక్షక  - రావా భవ భయ హరణుఁడ! వర మగు భవుఁడా!
భావాతీతా! భవ్య ప్ర - భావా! ప్రవిమల చరితుగ వరలఁ గనుము నన్.
3. సరసిజ వృత్త గర్భిత కందము(2)
జీవేశా! నా చింతయు, - సేవల్, శివ పద భరణము కృతికి పతివయే
దేవా నీ యందే గురు - దేవా! దివిజ భరణ! హర! తెలియుము కృతిలోన్.
4. సరసిజ వృత్త గర్భిత కందము(3)
భవ భయ హరణుఁడ! వర మగు - భవుఁడా! ప్రవిమల చరితుగ వరలఁ గనుము నన్.
శివ పద భరణము కృతికి ప - తివయే దివిజ భరణ! హర! తెలియుము కృతిలోన్
5. సరసిజ వృత్త గర్భిత మణిగణనికర (శశికళా) వృత్తము[న---- గణములు.యతి:1-9]
భవ భయ హరణుఁడ! వర మగు భవుఁడా!
ప్రవిమల చరితుగ వరలఁ గనుము నన్.
శివ పద భరణము కృతికి పతివయే
దివిజ భరణ! హర! తెలియుము కృతిలోన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.