జైశ్రీరామ్.
శ్లో. ధర్మో పార్జిత జీవితానామ్ శాస్త్రేషు జ్ఞానేషు సదా రతానామ్
జితేంద్రియాణా మథితి ప్రియానామ్
గృహేషు మోక్షః పురుషోత్త మానామ్.
గీ. ధర్మసముపార్జితోజ్జీవి, ధరను సతము
శాస్త్ర విజ్ఞాన రతుఁడును,శాంత మూర్తి,
సువిజితేంద్రియాతిథిసేవ, శుభదుఁడయిన
గృహికి మోక్షము ప్రాప్తించు. గృహమునందె.
భావము. ధర్మ మార్గమున జీవయాత్ర సాగిస్తూ, నిరంతరమూ జ్ఞానము,శాస్త్రములు అధ్యయనంచేస్తూ ఆనందించేవాడు, ఇంద్రియ లౌల్యానికి లొంగకుండా వాటిని తన వశంలో వుంచుకున్నవాడు, అతిథులకి అత్యంత ప్రియముతో గౌరవ మర్యాదలు చేసేవాడు గృహస్తాశ్రమములో ఉన్నాకూడా మోక్షము లభిస్తుంది. మోక్షం సాధించాలంటే సన్యసించి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. స్వధర్మ నిర్వహణతో మోక్షం లభిస్తుంది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును మన సనాతన ధర్మములను సక్రమముగా చేయుచు ధర్మ మార్గమున నీతి నియమములను పాటించి దైవ చింతనలో జీవనము సాగించిన వారికి మోక్షము తప్పక లభిస్తుంది. బాగుంది మంచి సూక్తి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.