గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
Suprabha Pavuluri శ్రీకర, ఆర్జనా, మాదకశ్రీ, గతిమా గర్భ హితకరి వృత్తము హితకరివ్రాసెడి పద్యంబియ్యది శ్రమనీయదు, వాణి రాల్చెఁ , క్రన్నన నాకై గాసిని నాకీ దేవిధిఁ ! గమనీయము సూడ రూపు! గంధము లొల్కున్హాసములే జిందించెడు ! నమృతంబుగ మోదమిచ్చు! హాయినిఁ గూర్చున్వాసియు నాకందించును! భ్రమ బాపుచు గుండెలోన ! భారతి వాక్కైశ్రీకరవ్రాసెడి పద్యంబియ్యది గాసిని నాకీదేవిధి హాసములే జిందించెడు వాసియు నాకందించునుఆర్జనావ్రాసెడి పద్యంబియ్యది శ్రమనీయదు గాసిని నాకీదేవిధిఁ ! గమనీయము హాసములే జిందించెడు ! నమృతంబుగ వాసియు నాకందించును! భ్రమబాపుచుమాదకశ్రీవ్రాసెడి పద్యంబియ్యది శ్రమనీయదు వాణి రాల్చె గాసిని నాకీదేవిధిఁ ! గమనీయము సూడ రూపు! హాసములే జిందించెడు! నమృతంబుగ మోదమిచ్చు! వాసియు నాకందించును! భ్రమబాపుచు గుండెలోనగతిమాశ్రమనీయదు వాణిరాల్చెఁ గమనీయము సూడ రూపు! నమృతంబుగ మోదమిచ్చు భ్రమబాపుచు గుండెలోనసుప్రభ 2:20 PM02-26-2017వృత్తము --ఛందస్సు-- గణములు -- యతి/యతులు ----------------------------------------------------------------------హితకరి -- ఆకృతి -- భ,మ,న,జ,జ,ర,స,గ -- 1,9,18 శ్రీకర - అనుష్టుప్ - భ,మ,లల --యతిలేదు ఆర్జనా -- అతిజగతీ - భ,మ,న,జ,ల ------- 1,9మాదకశ్రీ - అత్యష్టీ -- భ,మ,న,జ,జ,గల ----- 1,9గతిమా -- బృహతీ -- స,స,జ -- యతి లేదునేను నిన్న ప్రచురించిన" రక్షణీ,గతిమా,మహిత గర్భ నటకళా వృత్తము" నకు చింతా రామకృష్ణారావు గారి స్పందన జూచి, వారికి ధన్యవాదములు తెలిపి వారి టైమ్ లైన్ కు వెళ్ళి అక్కడ ప్రచురింపబడినవి చూస్తుండగా వారు పంచినది వల్లభ వఝల అప్పల నరసింహమూర్తిగారు వ్రాసిన" శ్రీకర,ఆర్జనా,మాదకశ్రీ గర్భ హితకరి వృత్తము" కనిపించినది. చదివి, నోట్ బుక్ లో నోట్ చేసికొని, చింతా వారిచ్చిన లింక్ ద్వారా ఆంధ్రామృతము బ్లాగ్ లోని వారి శివశతకము ను తెరిచి, చదువబోతుండగా హృదయములోనుండి వినిపించినది.."తరువాత చదువుకోవచ్చు,పద్యమిస్తాను" -- అని. ఏమిరాబోతున్నదో అని అనుకుంటుండగా.. "ఇప్పుడు వ్రాసికొన్నదే" .. అని వినిపించింది. మౌనముగా టైప్ చేయటము మొదలుబెట్టాను. అందిన/వ్రాయించిన పలుకులు పైన చూపిన పద్యము/పద్యములుగా వచ్చాయి.వల్లభ వఝల వారు గర్భితము చేసిన శ్రీకర,ఆర్జనా, మాదకశ్రీ లకు తోడుగా, అదనముగా గతిమా వృత్తమును కూడ జొప్పించి ఆనందము గలిగించారు సర్ప్రైజ్ గిఫ్ట్ గా. :-)తమ పోస్ట్/ పద్యములతో స్ఫూర్తి గలిగించిన చింతా వారికీ, వల్లభ వఝల వారికి ధన్యవాదశతములతో, అడుగకుండానే ఆదరముతో నాలుగవ వృత్తమును గూడ చేర్చి గర్భకవితను కానుకజేసిన అంబకు/సద్గురుమూర్తి కి సాదర ప్రణామాలతో..
నమస్కారములు. నూతన ఛందములో గర్భ కవిత అద్భుతముగ నున్నది . మాన్యులు శ్రీ వల్లభవఝుల వారు శ్లాఘ నీయులు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
Polimera Malleswara Rao 7:07pm Mar 1వృత్తము --ఛందస్సు-- గణములు -- యతి/యతులుహితకరి -- ఆకృతి -- భ,మ,న,జ,జ,ర,స,గ -- 1,9,18శ్రీకర - అనుష్టుప్ - భ,మ,లల --యతిలేదుఆర్జనా -- అతిజగతీ - భ,మ,న,జ,ల ------- 1,9మాదకశ్రీ - అత్యష్టీ -- భ,మ,న,జ,జ,గల ----- 1,9గతిమా -- బృహతీ -- స,స,జ -- యతి లేదు************************************************హితకరిమాధవివై చేదోడుగ ! మనసిచ్చుచు ప్రేమ పంచి ! మల్లెల తీగన్ నా దరినే వుంటూ మది ! నను, దేవిగ ధైర్య మిచ్చి ! నాచరణందున్ వేదనలన్ ఛేదించుచు ! వినయమ్ముగ నాదరించు ! ప్రేయసిగా నా సేదను తీర్చే పత్నివి ! చినదానివి నీవె మంగ ! సేక్తగ పల్కుల్!మాదకశ్రీమాధవివై చేదోడుగ ! మనసిచ్చుచు ప్రేమ పంచి ! నా దరినే వుంటూ మది ! నను, దేవిగ ధైర్య మిచ్చి ! వేదనలన్ ఛేదించుచు ! వినయమ్ముగ నాదరించు ! సేదను తీర్చే పత్నివి ! చినదానివి నీవె మంగ ! ఆర్జనామాధవివై చేదోడుగ ! మనసిచ్చుచు నా దరినే వుంటూ మది ! నను, దేవిగ వేదనలన్ ఛేదించుచు ! వినయమ్ముగ సేదను తీర్చే పత్నివి ! చినదానివి శ్రీకరమాధవివై చేదోడుగ ! నా దరినే వుంటూ మది ! వేదనలన్ ఛేదించుచు ! సేదను తీర్చే పత్నివి ! గతిమామనసిచ్చుచు ప్రేమ పంచి నను, దేవిగ ధైర్య మిచ్చి వినయమ్ముగ నాదరించుచినదానివి నీవె మంగ ! ***********************************************
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
3 comments:
Suprabha Pavuluri
శ్రీకర, ఆర్జనా, మాదకశ్రీ, గతిమా గర్భ హితకరి వృత్తము
హితకరి
వ్రాసెడి పద్యంబియ్యది శ్రమనీయదు, వాణి రాల్చెఁ , క్రన్నన నాకై
గాసిని నాకీ దేవిధిఁ ! గమనీయము సూడ రూపు! గంధము లొల్కున్
హాసములే జిందించెడు ! నమృతంబుగ మోదమిచ్చు! హాయినిఁ గూర్చున్
వాసియు నాకందించును! భ్రమ బాపుచు గుండెలోన ! భారతి వాక్కై
శ్రీకర
వ్రాసెడి పద్యంబియ్యది
గాసిని నాకీదేవిధి
హాసములే జిందించెడు
వాసియు నాకందించును
ఆర్జనా
వ్రాసెడి పద్యంబియ్యది శ్రమనీయదు
గాసిని నాకీదేవిధిఁ ! గమనీయము
హాసములే జిందించెడు ! నమృతంబుగ
వాసియు నాకందించును! భ్రమబాపుచు
మాదకశ్రీ
వ్రాసెడి పద్యంబియ్యది శ్రమనీయదు వాణి రాల్చె
గాసిని నాకీదేవిధిఁ ! గమనీయము సూడ రూపు!
హాసములే జిందించెడు! నమృతంబుగ మోదమిచ్చు!
వాసియు నాకందించును! భ్రమబాపుచు గుండెలోన
గతిమా
శ్రమనీయదు వాణిరాల్చెఁ
గమనీయము సూడ రూపు!
నమృతంబుగ మోదమిచ్చు
భ్రమబాపుచు గుండెలోన
సుప్రభ
2:20 PM
02-26-2017
వృత్తము --ఛందస్సు-- గణములు -- యతి/యతులు
----------------------------------------------------------------------
హితకరి -- ఆకృతి -- భ,మ,న,జ,జ,ర,స,గ -- 1,9,18
శ్రీకర - అనుష్టుప్ - భ,మ,లల --యతిలేదు
ఆర్జనా -- అతిజగతీ - భ,మ,న,జ,ల ------- 1,9
మాదకశ్రీ - అత్యష్టీ -- భ,మ,న,జ,జ,గల ----- 1,9
గతిమా -- బృహతీ -- స,స,జ -- యతి లేదు
నేను నిన్న ప్రచురించిన" రక్షణీ,గతిమా,మహిత గర్భ నటకళా వృత్తము" నకు చింతా రామకృష్ణారావు గారి స్పందన జూచి, వారికి ధన్యవాదములు తెలిపి వారి టైమ్ లైన్ కు వెళ్ళి అక్కడ ప్రచురింపబడినవి చూస్తుండగా వారు పంచినది వల్లభ వఝల అప్పల నరసింహమూర్తిగారు వ్రాసిన" శ్రీకర,ఆర్జనా,మాదకశ్రీ గర్భ హితకరి వృత్తము" కనిపించినది. చదివి, నోట్ బుక్ లో నోట్ చేసికొని, చింతా వారిచ్చిన లింక్ ద్వారా ఆంధ్రామృతము బ్లాగ్ లోని వారి శివశతకము ను తెరిచి, చదువబోతుండగా హృదయములోనుండి వినిపించినది.."తరువాత చదువుకోవచ్చు,పద్యమిస్తాను" -- అని. ఏమిరాబోతున్నదో అని అనుకుంటుండగా.. "ఇప్పుడు వ్రాసికొన్నదే" .. అని వినిపించింది. మౌనముగా టైప్ చేయటము మొదలుబెట్టాను. అందిన/వ్రాయించిన పలుకులు పైన చూపిన పద్యము/పద్యములుగా వచ్చాయి.
వల్లభ వఝల వారు గర్భితము చేసిన శ్రీకర,ఆర్జనా, మాదకశ్రీ లకు తోడుగా, అదనముగా గతిమా వృత్తమును కూడ జొప్పించి ఆనందము గలిగించారు సర్ప్రైజ్ గిఫ్ట్ గా. :-)
తమ పోస్ట్/ పద్యములతో స్ఫూర్తి గలిగించిన చింతా వారికీ, వల్లభ వఝల వారికి ధన్యవాదశతములతో, అడుగకుండానే ఆదరముతో నాలుగవ వృత్తమును గూడ చేర్చి గర్భకవితను కానుకజేసిన అంబకు/సద్గురుమూర్తి కి సాదర ప్రణామాలతో..
నమస్కారములు.
నూతన ఛందములో గర్భ కవిత అద్భుతముగ నున్నది . మాన్యులు శ్రీ వల్లభవఝుల వారు శ్లాఘ నీయులు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
Polimera Malleswara Rao 7:07pm Mar 1
వృత్తము --ఛందస్సు-- గణములు -- యతి/యతులు
హితకరి -- ఆకృతి -- భ,మ,న,జ,జ,ర,స,గ -- 1,9,18
శ్రీకర - అనుష్టుప్ - భ,మ,లల --యతిలేదు
ఆర్జనా -- అతిజగతీ - భ,మ,న,జ,ల ------- 1,9
మాదకశ్రీ - అత్యష్టీ -- భ,మ,న,జ,జ,గల ----- 1,9
గతిమా -- బృహతీ -- స,స,జ -- యతి లేదు
************************************************
హితకరి
మాధవివై చేదోడుగ ! మనసిచ్చుచు ప్రేమ పంచి ! మల్లెల తీగన్
నా దరినే వుంటూ మది ! నను, దేవిగ ధైర్య మిచ్చి ! నాచరణందున్
వేదనలన్ ఛేదించుచు ! వినయమ్ముగ నాదరించు ! ప్రేయసిగా నా
సేదను తీర్చే పత్నివి ! చినదానివి నీవె మంగ ! సేక్తగ పల్కుల్!
మాదకశ్రీ
మాధవివై చేదోడుగ ! మనసిచ్చుచు ప్రేమ పంచి !
నా దరినే వుంటూ మది ! నను, దేవిగ ధైర్య మిచ్చి !
వేదనలన్ ఛేదించుచు ! వినయమ్ముగ నాదరించు !
సేదను తీర్చే పత్నివి ! చినదానివి నీవె మంగ !
ఆర్జనా
మాధవివై చేదోడుగ ! మనసిచ్చుచు
నా దరినే వుంటూ మది ! నను, దేవిగ
వేదనలన్ ఛేదించుచు ! వినయమ్ముగ
సేదను తీర్చే పత్నివి ! చినదానివి
శ్రీకర
మాధవివై చేదోడుగ !
నా దరినే వుంటూ మది !
వేదనలన్ ఛేదించుచు !
సేదను తీర్చే పత్నివి !
గతిమా
మనసిచ్చుచు ప్రేమ పంచి
నను, దేవిగ ధైర్య మిచ్చి
వినయమ్ముగ నాదరించు
చినదానివి నీవె మంగ !
***********************************************
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.