జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీమన్మధ నామ సంవత్సర కార్తీక శుద్ధ విదియా శుక్రవారం నాడు 16 / 24 గంటల వ్యవధిలో ఆ జగన్మాత కృపచే వ్రాసిన చంపక భారతి అనే భారతీశతకమును పఠించిన బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తి కవి తమయొక్క స్పందనను ఆ జగన్మాతను దర్శింపఁ జేయు బీజాక్షర రూపములో చిత్రకవితవెలయించి యున్నారు. వారి అవ్యాజానురాగ పూర్వక అభినందనలకు నా ధన్యవాదములు తెలియఁ జేయుచున్నాను.
ఆ పద్యములను మీరూ తిలకించండి.
కవి వరులైన శ్రీ వఝల వారికి ధన్యవాదములు.
బహుళ కంద గీత గర్భ చంపక మాల.
వర శుభభావ సత్ ఘనులు వల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్
స్థిర విభవున్ మహత్ సుగుణ తేజ భరున్, భవ చిద్విలాసు సా
క్షర సుభగున్ సదా నవ లసన్నిభు అప్పల నారసింహునిన్
వర ప్రభువున్ మదిన్ తలతు భాగ్య భవోద్భవ తత్వమూర్తిగా.
ఘనులు వల్లభవజ్ఝల జ్ఞాన తేజు
సుగుణ తేజ భరున్, భవ చిద్విలాసు
నవ లసన్నిభు అప్పల నారసింహు
తలతు భాగ్య భవోద్భవ తత్వమూర్తి
శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్.
సుభగున్ సదా నవ లస
న్నిభు అప్పల నారసింహునిన్వర ప్రభువున్.౧
విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్,
ప్రభువున్ మదిన్ తలతు భా
గ్య భవోద్భవ తత్వమూర్తిగా. వర శుభభా..౨
శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్.
విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్ ౩
శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్.
ప్రభువున్ మదిన్ తలతు భా
గ్య భవోద్భవ తత్వమూర్తిగా. వర శుభభా.౪
విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్
సుభగున్ సదా నవ లస
న్నిభు అప్పల నారసింహునిన్వర ప్రభువున్ ౫
నవ లసన్నిభు అప్పల నారసింహు
తలతు భాగ్య భవోద్భవ తత్వమూర్తి
ఘనులు వల్లభవజ్ఝల జ్ఞాన తేజు
సుగుణ తేజ భరున్, భవ చిద్విలాసు ౬.
ప్రభువున్ మదిన్ తలతు భా
గ్య భవోద్భవ తత్వమూర్తిగా. వర శుభభా
విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్, ౭.
విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్
శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్. ౮.
ప్రభువున్ మదిన్ తలతు భా
గ్య భవోద్భవ తత్వమూర్తిగా. వర శుభభా.
శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్. ౯.
సుభగున్ సదా నవ లస
న్నిభు అప్పల నారసింహునిన్వర ప్రభువున్
విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్ ౧౦.
జైహింద్.