జైశ్రీరామ్.
శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం , మంత్రమౌషధసంగమౌ , దానమానావమానాశ్చ , నవ గోప్యా మనీషిభిః.
ఆ.వె. వయసు, ధనములింట బాధించు గొడవలు
మంత్ర యౌషధములు, మాన, దాన
సంగమములు, మనల కృంగించు యవమాన
ములను పరుల కెపుడు తెలుప రాదు.
భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము ,
అవమానము - ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును అందరు తెలుసుకోవలసిన నిజములు చక్కగా వివరించారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.