గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఆగస్టు 2015, మంగళవారం

జరా రూపం హరతి ధైర్య ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. జరా రూపం హరతి ధైర్య మాశా ,
మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యా మసూయా ,
కామో హ్రియం వృత్త మనార్యసేవా ,
క్రోధః శ్రియం సర్వ మేవాభిమానః .

గీ. ముదిమి రూపమున్, ధైర్యమున్ పోని యాశ,
ప్రాణమున్ మృత్యు వసూయ వర్తనమును
కల్గు కామము సిగ్గును, ఖలుల సేవ
శీలము, శ్రియమున్ గోపము,కొల్లగొట్టు,
గర్వమది సర్వమున్ బాపు కనరదేల?

భావము. ముసలితనము రూపమును , ఆశ ధైర్యమును , మృత్యువు ప్రాణములను , అసూయ ధర్మప్రవృత్తినీ , కామము లజ్జను , దుష్టసేవ శీలమును, కోపము ఐశ్వర్యమును , గర్వము సర్వమును హరించును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పెద్దతనమున ఇవన్నీ హరించుకు పోవడం వలన ' ఆధ్యాత్మికము నందు నిలచి మోక్షమును కోరుకోవలెను కానీ ఎంతమంది ఆచరించ గలుగుతున్నారు అన్నదే ప్రశ్న .
చాలా మంచి విషయం చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.