గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఫిబ్రవరి 2015, గురువారం

మత్తేభ, కంద గర్భ సీసము. రచన: వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.

జైశ్రీరామ్.
మత్తేభ,కంద గర్భ సీసము
రచన: వల్లభవఝల అప్పల నరసింహమూర్తి
జుత్తాడ
సీ. సుగతినిన్ బొందెడి శోధనంబు లలరన్
గమ్యంబు స్వచ్ఛంబుగాదలచుచు
ప్రగతులనాంధ్రము రాజిలంగ సమతన్
గర్వించనౌ మిన్నగా యశమున
చిరతినే కొర్కెలు జీవముక్తి వరమై
రమ్యంబునై యొప్పురా తిరముగ
సుమతినిన్ స్వార్ధము సుంత మాని మసలన్
మర్త్యాళి కానందమౌ తలపగ

తే.గీఅనిశము పరులగని మది పనిగొని నిజ
ప్రజ్ఞ జూపి పద్ధతి నడువందనరును
జననికి సుఖములు మనసు సమత మవను
వినుమ మాధురి గొనుమా  వినయమునను


గర్భగత మత్తేభము
గతినిన్ పొందెడి శోధనంబు లలరన్ గమ్యంబు స్వచ్ఛంబుగా
గతులన్ ఆంధ్రము రాజిలంగ సమతన్ గర్వించ నౌ మిన్నగా
రతినే కోర్కెలు జీవముక్తి వరమై రమ్యంబునై యొప్పురా
మతినిన్ స్వార్ధము సుంత మాని మసలన్ మర్త్యాళి కానందమౌ
వినుమ మాధురి గొనుమా  వినయమునను
గర్భగత మత్తేభము
గతినిన్ పొందెడి శోధనంబు లలరన్ గమ్యంబు స్వచ్ఛంబుగా
గతులన్ ఆంధ్రము రాజిలంగ సమతన్ గర్వించ నౌ మిన్నగా
రతినే కోర్కెలు జీవముక్తి వరమై రమ్యంబునై యొప్పురా
మతినిన్ స్వార్ధము సుంత మాని మసలన్ మర్త్యాళి కానందమౌ
గర్భగత కందము
కంఅనిశము పరులను గని మది
పనిగొని నిజ ప్రజ్ఞ జూపి పధ్ధతి నడువన్
దనరును జననికి సుఖములు
మనసు సమత మవను వినుమ మాధురి గొనుమా !
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణారావు గురుదేవులకు పాదాభివందనములు.
శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి గారికి శతసహస్ర వందనములు.
వారి మత్తేభ కంద గర్భ సీసము అద్భుతం, మా వంటి వారికి పదనిర్దేశ్యము జేయుచున్న మీకు వినయమండిత వందనములతో..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూజ్యులు నరసింహ మూర్తిగారి పద్యము లన్నియు మనసుకు ఆనందమును కలిగించు చున్నవి వారికి ప్రణామములు ముఖ్యంగా మాకందిస్తున్నందులకు శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.