జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ కవి కలము నుండి వెలువడిన చిత్ర గర్భ కవితా ప్రసూనాల పరిమళాలు ఆఘ్రాణించండి.
చిత్రగర్భ కవితా ప్రసూనాలు
సీ. శ్రీమంత ధీమంత హేమాద్రి సుతకాంత
కామిత ఫలదాత కాముకాంత
పురహస్త గుణవంత పూజిత దివినుత
గణపరివేష్టిత గణపతి పిత
తమహంత తమిహంత తగుతగ నిలుచుత
తాపకాంత క సోమ పపా భూష
భూతపాతప హరిత భూషిత భస్మాంగ
ముక్కంటి మోహనా మూర్తి మంత
ఆ.వె. పుఱ్ఱె చేతబట్టి పుట్టి నిల్లు విడిచి
వల్లకాటిని బట్టి వరలె దెట్టు
యిట్టి బిచ్చమెత్తు వట్టి నిస్వార్థివి
పట్ట రెట్టు గుట్టు పాడు, జనము
సీ. చారు శీలుడు వీవు చరశీలుడను నేను
చారు విక్రమ కళా చతురు డీవు
నీవెంత? నేనెంత? నీ చెంత నిల్వంగ
నాకాంత పురకాంత నాట్యలోల
ప్రణవ నాదము నీవు ప్రణవ బీజము నీవు
ప్రణవార్థమవు నీవు భవుడ వీవు
పాతకాంతకుడీవు ప్రారబ్ద జీవాల
భవబంధ మోచన భాగ్యుడీవు
తే.గీ. కలను లీలను కనిపించి కనని యటుల
తెలియ దన్నట్టు చూచుట మెలికి గాదె
నన్ను రక్షించు సిరులిచ్చి నగజ గూడి
హృదయమందున నిల్చుమా మృదులముగను
సీ. సిరినెంచి హరినెంచి గిరిపుత్రి మదినెంచి
హరునెంచి భవునెంచి భవము నెంచి
పరిమళించిన పుష్ప బంధంబు లలరార
గర్భ కవితల వికసిత కృతిని
తెలుగు వెలుగు జిల్గు తేటతెల్లము గాగ
విత్తులై మొక్కలై వెలుగు లొంది
మొగ్గలై పూవులై నిగ్గైన దండలై
చెండులై దివిజుల నిండు గూర్ప
తే.గీ. ఖండికలుగాని రీతినే కలము నడిపి
బహు విధంబుల ఛందముల్ పరిమితముగ
హరి హరాదులు వాక్సతి సిరియు నుమయు
చిత్ర కల్పన గావించి గడగి నారు
తే.గీ. సిరులు విరియంగ హరినెంచి చేయునుతులు
భవము లెడలంగ శివమూర్తి భజనలెలమి
విఘ్నహంత్రుని గణపయ్య నుతులు దవుల
వరలువిద్యల వాక్సతి వరల నీయ
తే.గీ. బ్రహ్మ పూర్ణాయు వీయగ భక్తి గణుతి
సర్వ సమతను మదినెంచి చక్క బరచ
కృతిని గణపయ్య గావించె కూర్మిగనుడి
సప్త సప్తిక సప్తిదా సప్తదముల
తే.గీ. సప్తదంబుల సప్తార్చి సంత సిల్ల
సప్త సప్తాక పదులందు సప్తపదులు
సప్త జన్మాల యనుబంధ సరళు లలర
జగము లేడెడి సురలార జయము లిండు
సప్తి = గుఱ్ఱము, సప్తపదులు = హారములు, సప్తదములు = సర్వమును, సప్తార్చి
= సూర్యుడు.
సీ. శ్రీమంత ధీమంత హేమాద్రి సుతకాంత
కామిత ఫలదాత కాముకాంత
పురహస్త గుణవంత పూజిత దివినుత
గణపరివేష్టిత గణపతి పిత
తమహంత తమిహంత తగుతగ నిలుచుత
తాపకాంత క సోమ పపా భూష
భూతపాతప హరిత భూషిత భస్మాంగ
ముక్కంటి మోహనా మూర్తి మంత
ఆ.వె. పుఱ్ఱె చేతబట్టి పుట్టి నిల్లు విడిచి
వల్లకాటిని బట్టి వరలె దెట్టు
యిట్టి బిచ్చమెత్తు వట్టి నిస్వార్థివి
పట్ట రెట్టు గుట్టు పాడు, జనము
సీ. చారు శీలుడు వీవు చరశీలుడను నేను
చారు విక్రమ కళా చతురు డీవు
నీవెంత? నేనెంత? నీ చెంత నిల్వంగ
నాకాంత పురకాంత నాట్యలోల
ప్రణవ నాదము నీవు ప్రణవ బీజము నీవు
ప్రణవార్థమవు నీవు భవుడ వీవు
పాతకాంతకుడీవు ప్రారబ్ద జీవాల
భవబంధ మోచన భాగ్యుడీవు
తే.గీ. కలను లీలను కనిపించి కనని యటుల
తెలియ దన్నట్టు చూచుట మెలికి గాదె
నన్ను రక్షించు సిరులిచ్చి నగజ గూడి
హృదయమందున నిల్చుమా మృదులముగను
సీ. సిరినెంచి హరినెంచి గిరిపుత్రి మదినెంచి
హరునెంచి భవునెంచి భవము నెంచి
పరిమళించిన పుష్ప బంధంబు లలరార
గర్భ కవితల వికసిత కృతిని
తెలుగు వెలుగు జిల్గు తేటతెల్లము గాగ
విత్తులై మొక్కలై వెలుగు లొంది
మొగ్గలై పూవులై నిగ్గైన దండలై
చెండులై దివిజుల నిండు గూర్ప
తే.గీ. ఖండికలుగాని రీతినే కలము నడిపి
బహు విధంబుల ఛందముల్ పరిమితముగ
హరి హరాదులు వాక్సతి సిరియు నుమయు
చిత్ర కల్పన గావించి గడగి నారు
తే.గీ. సిరులు విరియంగ హరినెంచి చేయునుతులు
భవము లెడలంగ శివమూర్తి భజనలెలమి
విఘ్నహంత్రుని గణపయ్య నుతులు దవుల
వరలువిద్యల వాక్సతి వరల నీయ
తే.గీ. బ్రహ్మ పూర్ణాయు వీయగ భక్తి గణుతి
సర్వ సమతను మదినెంచి చక్క బరచ
కృతిని గణపయ్య గావించె కూర్మిగనుడి
సప్త సప్తిక సప్తిదా సప్తదముల
తే.గీ. సప్తదంబుల సప్తార్చి సంత సిల్ల
సప్త సప్తాక పదులందు సప్తపదులు
సప్త జన్మాల యనుబంధ సరళు లలర
జగము లేడెడి సురలార జయము లిండు
సప్తి = గుఱ్ఱము, సప్తపదులు = హారములు, సప్తదములు = సర్వమును, సప్తార్చి
= సూర్యుడు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
పూజ్యులు శ్రీ వల్లభవఝుల వారి కలం నుండి విరిసిన పద్య కుసుమములు ఎన్ని ఎన్నైనా ఆఘ్రాణించ దగినవే . "అ " నుండి వెలువడినవీ " శ్రీశా మహేశా " అన్ని అన్నియు అద్భుతములైనవే .కనీసం చదవగా చదవగా నైనా కొంచం నేర్చుకో గలిగితే ధన్యు రాలను కృతజ్ఞతలతో సెలవు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.