గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఫిబ్రవరి 2015, గురువారం

పద్య ప్రసూన ప్రకాశము - ఆముక్తమాల్యద. వక్త శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీమాన్ ఘట్టి కృష్ణ మూర్తి మన ఆంధ్ర కల్పధృమ ప్రసూన సౌరభాలను అమెరికాలో గుబాళింప చేసి మన భాషకు, మన తెలుగు జాతికి వన్నె తెచ్చిన విధానం కన్నులారా చూస్తూ, చెవులారా విని మనసారా ఆనందించండి. ఇక వారి మాటలలోనే వివరాలను తెలుకొని, వినండి.
వక్త శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి :- నేను అమెరికా లో వల్డొస్ట అనే చిన్న జార్జియా సిటీ లో మా అబ్బాయి దగ్గర వున్నాను . డల్లాస్ లో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ ( TANTEX ) వారి ఆహ్వానం మేరకు వారు నిర్వహించే నెలనెలా వెన్నెల జనవరి నెల 18న నిర్వహించబడ్డ 90వ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వెళ్ళి "పద్య ప్రసూన ప్రకాశము - ఆముక్త మాల్యద " అనే అంశాల పైన ప్రసంగం చేసిన వీడియో లను పంపుతున్నాను . వీలుంటే చూడండి . 


శ్రీమాన్ ఘట్టి కృష్ణ మూర్తి మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ,
అమెరికాలో వీరి ఉపన్యాసమును ఏర్పాటు చేసి, మన ఆంధ్రభాషా ప్రాశస్త్యాన్ని దశదిశలకు వ్యాపింప చేస్తున్న మన యావన్మంది తెలుగువారినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

3 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ suryanarayana rao ponnekanty గారు ఇలా అన్నారు.
ఘట్టి కృష్ణ మూర్తి గారి ఆముక్త మాల్యద , ప్రసంగం చాల అనర్గళంగా అద్భుతం గ ఉన్నది . మన పద్య విద్యను విస్తృత ప్రచారం చేస్తున్నందుకు కృతఙ్ఞతలు. ఈ వీడియోను ప్రచురించిన మా సహోదరులు చింతా వారికీ ధన్య వాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
అసలు ఆముక్త మాల్యద అంటేనే అందలి పద్యకుసుమ సౌరభములు వీనుల విందు అందునా శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి గారివంటి మహాను భావుల గళము నుండి జాలువారినవి వినగల అదృష్టాన్ని మాకు కలిగించినందులకు శ్రీ చింతా వారికి ధన్య వాదములు గానమాధ్యుర్యమును మాకందించిన శ్రీ కృష్ణ మూర్తి గారికి శిరసాభి వందనములు

Kollarapu Prakash Rao Sharma చెప్పారు...

తే. గీ.
ఘట్టి వ్యాఖ్యలు సుధలూరు గాన ఝరులు
పారి ఆముక్త మాల్యదా స్వాదనంబు
నారికేళపాకములను నయము నొప్ప
జేసి యందించె! గ్రోలుడు చిత్తమలర!

- కొల్లారపు ప్రకాశరావు శర్మ (USA)
గ్రంథకర్త కొల్లారపు పద్యరచనామృతబోధిని
Free 200 page pdf. kollarapu.bodhini@gmail.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.