గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఫిబ్రవరి 2015, గురువారం

తోటక తోథక చిత్రపద గర్భ లాటీవిటవృత్తము. రచన.శ్రీవల్లభ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పల నరసింహమూర్తికవి కృత తోటక తోథక చిత్రపద గర్భ లాటీవిటవృత్తము చూడండి.
తోటక తోథక చిత్రపద గర్భ లాటీవిటవృత్తము
వర వారథి వీర భవాపహ దేవా మమ్మేలంగన్వలె సోమా
సుర శూరమ ధీర యశోవర తేజుల్  పర్వంగం గావుమ దేవా
మరు మారక మారయ మా పరమాత్మా సర్వేశా నామది నిండన్
సరసా రససారస సాకువరాంశా శ్రీ మల్లేశా వెస బ్రోవన్
గర్భగత తోటకము. (యతి 9వ యక్షరము) 
వర వారధి వీర భవాపహ దేవా
సుర శూరమ ధీర యశోవర తేజుల్
మరు మారక మారయ మా పరమాత్మా          
సరసా రస సారస సాకు వరాంశా
గర్భగత తోధకము. (యతి7వ యక్షరము) 
వారధి వీర భవాపహ దేవా
శూరము ధీర యశోవర తేజుల్
మారక మారయ మాపర మాత్మా                   
సారస సా రస సాకు వరాంశా
గర్భగత చిత్రపద వృత్తము. (ప్రాస మాత్రమేయుండును)
వీర భయాపహ దేవా
ధీర యశోవర తేజుల్
మారయ మా పరమాత్మా                                    
సారస సాకు వరాంశా.
చిత్రకవితాభిమాన కవి శ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తిగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.