గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఫిబ్రవరి 2015, సోమవారం

శబ్బాష్ రా శంకరా! శ్రీ తనికెళ్ళ భరణి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మహోత్కృష్టమైన శివరాత్రి రేపే వచ్చెస్తోంది. అందరికీ శుభాకాంక్షలు.
భక్తుల ఆనందానికి అవధులే ఉండవు.
అట్టి భక్తులలో ఒకరు మన తనికెళ్ళ భరణి గారు.
శ్రీ తనికెళ్ళ భరణి సాక్షాత్ శివునే అధిక్షేపిస్తున్నట్లు కనిపించేలా శివునితో శబ్బాష్ రా శంకరా! అంటూ లోకం తీరును ఎండకట్టుతున్న తీరు చూడండి. తన మనస్సును శివుని ముందు ఆవిష్కరించిన శ్రీ తనికెళ్ళ భరిణిగారికి
తెల్లవారితే శివరాత్రి సందర్భంగా అభినందన పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఓం నమశ్శివాయ.

భావ గోపన చిత్ర ఉత్పలమాల.

శ్రీప్రద  శాంవీసతి,    ప్రసిద్ధ   మహాశివు డీ           కనేమై                                                                                      
యప్రతి   వీ భక్త!   చరణాంబుజ  సే గ్రహించి, యేలు స                                                                        
ద్విప్రుల వాణిరూపమున, విజ్ఞుఁడ! నీ కృషి మెచ్చి  బాగుగా!                                                                 

విప్ర  సుధీ  కిరణ్మయుఁడ! వెల్గుమ దీము వోలె  సాంమున్.!
 
భరణికి శివ కృప కలుగుత.
జైహింద్.
                                                                                                                     
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ " మహాశివ రాత్రి శుభాకాంక్షలు "
శివరాత్రి పర్వదినాన శ్రీ భరణి గారి కవితలను వినగల అదృష్టం మహద్భాగ్యం " అవి ఖచితంగా విని తీరాలి అంత అద్భుతంగా ఉంటాయి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.