గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జనవరి 2014, మంగళవారం

ఎప్పుడెప్పుడేదేది మనకు తోడు? మేలిమి బంగారం మన సంస్కృతి 149.

జైశ్రీరాం.
శ్లో. విద్యా మిత్రం ప్రవాసేషు, భార్యా మిత్రం గృహేషుచ ,
వ్యాధితస్యౌషధం మిత్రం , ధర్మో మిత్రం మృతస్యచ.
గీ. దూర దేశమందున మన తోడు విద్య.
గృహమునందున్న మనతోడు గృహిణి యౌను.
వ్యాధి తోనున్న తోడగు నౌషధంబు. 
మృత్యువేళను మనతోడు సత్య చరిత.
భావము.  దూరప్రాంతములందు ఉన్నప్పుడు విద్య, ఇంటిలో ఉన్నప్పుడు భార్య , వ్యాధితో పీడింపబడుచున్నప్పు ఔషధం, మరణించినప్పుడు ధర్మము మనకు తోడుగానుండు స్నేహితులు. 
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అసలైన స్నేహితు లేవరో చక్కగా చెప్పారు అందుకే మన భాష మేలిమి బం గారం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.