గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2014, బుధవారం

స్వర్గంలో తనకోసం ఎదురు చూస్తున్న తన అర్థాంగ లక్ష్మి అన్నపూర్ణ దగ్గరకు వెళ్ళిపోయిన అక్కినేని

జైశ్రీరాం. 
ఆర్యులారా. మన అభిమాన సినీ కళాకారుఁడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు  సెలవు తీసుకొంటున్నారు చూడండి.

ఓం నమశ్శివాయ.
నాపై అవ్యాజమైన అభిమానాన్ని చూపించిన నా అభిమానులారా! మీ అభిమానమే ఊపిరిగా ఇన్నాళ్ళూ జీవించించాను.  నా అర్థాంగ లక్ష్మి అన్నపూర్ణ నాకోసం స్వర్గం నుండి ఎన్నాళ్ళని ఎదురు చూస్తుంది? అందుకనే నేను  ఆమెదగ్గరికి  వెళ్ళిపోతున్నాను .  వెళ్ళిపోతున్నాందులకు   నన్ను మన్నించండి. నన్ను అనుమతించండి. ఇక సెలవు. 
అభిమానులందరి నుండి శాశ్వితముగా సెలవు తీసుకున్న అక్కినేని నాగేశ్వరరావు.
తెలుగు సినీ రంగమున ప్రవేశించిన నాటి నుండియు నిరుపమానమైన తన సహజ నటనతో ఆబాల గోపాలమును అలరింపజేసి అజాత శతృవుగా పేరు గడించి, తన కీర్తి చంద్రికలను శాశ్వితముగా భూపై నిలిపి తాను తన అర్థాంగ లక్ష్మిని చేరుకొనుటకు శాశ్వితముగా వెళ్ళిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారికి ఆంధ్రామృతం శ్రద్ధాంజలి ఘటిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు, అభిమాన జనకోటికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.
ఓం నమో భగవతే శ్రీమన్నారాయణాయ.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.