గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2014, శనివారం

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి (మేలిమి బంగారం మన సంస్కృతి 149)

జైశ్రీరాం.
శ్లో: వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి 
రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం
ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివాంభో 
లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రమ్.
క: పులివలె పయిఁబడు వృద్ధత,
పలు రోగములావహించు, పగిలిన కుండన్
నిలువని నీరటులాయువు
తొలగును. మరి దుష్ట బుద్ధి తొలగదదేలో?    
భావము:  ముసలితనము ఆడపులివలె చూపుడు వ్రేలితో బెదిరించుచున్నది. శత్రువులు వలె రోగాలు  దేహమును హరించుచున్నవి. పగిలిన కుండలోని నీరు వలె ఆయుర్దాయము తరిగిపోవుచున్నది.ఐనప్పటికీ లోకం అహితకార్యములు  చేయుచునే యుండుట ఆశ్చర్యం!  
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శుభాశీస్సులు.
మాదొక చిన్న ప్రయత్నము:

ముదిమి పైబడు నొక పెద్ద పులికి బోలె
నావహించును రోగమ్ము లరుల మాడ్కి
చిల్లి కుండలో జలమట్లు చెల్లు నాయు
వయ్యు చెడుబుద్ధి తొలగదేలయ్య బళిర!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
క్షమించాలి ఈ మధ్య కొద్ది రోజులుగా సిస్టం బాగులేక ఆంద్రామృతాన్నిమిస్సయ్యాను . ఇప్పుడు మళ్ళీ అద్రుష్టం లభించింది.కొత్త సిస్టం వచ్చింది
చాలా మంచి పద్యం చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.