గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2014, శుక్రవారం

దాన ధర్మబుద్ధి దైవ గుణము. మేలిమి బంగారం మన సంస్కృతి 151.

జైశ్రీరాం
శ్లో. అక్షరద్వయ మభ్యస్తం “నాస్తి నాస్తీ”తి యత్పురా
తదిదం “ దేహి దేహీ ”తి విపరీతముపస్థితమ్.
ఆ.  నాస్తి నాస్తి యని యనాథులకీయమి
నాటి లోభితనము నేటి ఫలము.
దేహి దేహి యనుచు దేవురింపఁగ వచ్చు.
దాన ధర్మబుద్ధి దైవ గుణము.  
భావము. పూర్వం “నాస్తి, నాస్తి ” అనే రెండక్షరాలు నేర్చిన ఫలితంగా ఇపుడు “దేహి,దేహి” అనవలసిన విపరీత స్థితి ఏర్పడింది ! (పూర్వం ఎవరికీ దానం చేయకపోవటం వల్ల , ఇపుడు యాచించే స్థితి సంక్రమించింది.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

మాదొక చిన్న ప్రయత్నము:

ధనము కలుగు నాడు దానమ్ము సేయక
అకట నాస్తి నాస్తి యనెడు వాన్కి
ధనము చెల్లి నంత తప్పవు ముప్పులు
తిప్ప లకట! దేహి దేహి యనుట

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే ఎంత సంపాదించా మన్నది ముఖ్యం గాదు ఎంత దానం చేయ గలిగామన్నది ముఖ్యం మేలిమి బంగారాన్ని అందిస్తున్న మా సోదరులు అసలైన మేలిమి బంగారానికి అభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.