గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జనవరి 2014, శనివారం

విద్యా హీనా న శోభంతే. మేలిమి బంగారం మన సంస్కృతి 148

జైశ్రీరామ్.
శ్లో: రూప యౌవన సంపన్నాఃవిశుద్ధ కుల సంభవాః
విద్యా హీనా న శోభంతే నిర్గంధా ఇవ కిమ్శుకాః.
గీ. రూప యౌవన సంపదల్ రూఢిఁ గలిగి,
శుద్ధ కులజులైయుండియు శోభిలరుగ 
విద్యలేనట్టి వారలు విశ్వమందు
పరిమళము లేని కింశుక వరల నట్లు!
భావము: రూప యౌవన సంపన్నులైనవారైనను, ఉత్తమ కులములో పుట్టినవారైనను విద్యావిహీనులైనట్లైతే సువాసన లేని మోదుగు పువ్వువలె శొభించరు. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.