జైశ్రీరాం.
శ్లో. విద్యా మిత్రం ప్రవాసేషు, భార్యా మిత్రం గృహేషుచ ,
వ్యాధితస్యౌషధం మిత్రం , ధర్మో మిత్రం మృతస్యచ.
గీ. దూర దేశమందున మన తోడు విద్య.గృహమునందున్న మనతోడు గృహిణి యౌను.
వ్యాధి తోనున్న తోడగు నౌషధంబు.
మృత్యువేళను మనతోడు సత్య చరిత.
భావము. దూరప్రాంతములందు ఉన్నప్పుడు విద్య, ఇంటిలో ఉన్నప్పుడు భార్య , వ్యాధితో పీడింపబడుచున్నప్పు ఔషధం, మరణించినప్పుడు ధర్మము మనకు తోడుగానుండు స్నేహితులు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అసలైన స్నేహితు లేవరో చక్కగా చెప్పారు అందుకే మన భాష మేలిమి బం గారం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.