గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జనవరి 2014, సోమవారం

తెలుగు పద్యానికి దోదహదం. ఒక చర్చ. మీ అమూల్యమై న అభిప్రాయాలను కూడా తెలియజేయగలరు.

జైశ్రీరాం. ఆర్యులారా! మనది అనుకొన్న తెలుగు తేజం క్రమేణా క్షీణిస్తోందన్న విషయంలో తెలుగువారి హృదయాలను కలత పడుతున్న మాట వాస్తవం.అందునా తెలుగు పద్యము మరీ నిరాదరణకు లోనౌతోంది. ఈ విషయమై కలత చెందుతున్న మహనీయులు చాలా ఆలోచించి, ఏదో ఒకటి చేయాలి, మన తెలుగు పద్యం పూర్వ వైభవాన్ని పొందాలి అనే ఆలోచనతో నిన్న సాయంత్రం శ్రీ వేము భీమేశంకరం గారి సాహితీ పీఠంలో ఒక చర్చావేదిక నిర్వహించారు. ఆంధ్ర భూమి సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి, భక్తి టీవీ కి సంబంధించిన శ్రీ ఎం.వి.ఆర్.శర్మ, తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతి శ్రీ అనుమాండ్ల భూమయ్య, డా.బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు శ్రీ రావికంటి వసునందన్, శ్రీ రాపాక ఏకాంబరాచారి, శ్రీ వేము భీమశంకరం, శ్రీ సాధన నరసింహాచార్యులు, ఆచార్య ఫణీంద్ర, ఇంకా పెక్కుమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నేను కూడా ఈ సభలో పాల్గొన్నాను.
పాల్గొన్నవారందరూ తెలుగు భాషాభివృద్ధికై అనేకమైన సూచనలు చేశారు.పద్య రచనలో సామాజిక స్పృహ పెంపొందించుకొనుట, బాల బాలికలకు మనోరంజకంగా ఉండే విధమైన పద్యాల పఠనములో శిక్షణ నిచ్చుట, టీవీ కార్యక్రమములలో తెలుగు పద్యములతో కూడిన కార్యక్రమాలను రూపొందించుట, ఆ కార్యక్రమములద్వారా విద్యార్థులలో తెలుగు పద్యముపై మక్కువ కలిగించుట,  నెలకొకమారైనా సమావేశమై అభివృద్ధిని సమీక్షించుట,   ఇత్యాదిగా అనేకమైన సూచనలు చేసియున్నారు.
అందు వేము భీమశంకరంగారి అభిప్రాయం లిఖిత పూర్వకంగా అందజేసినారు అది మీ ముందుంచుతున్నాను. 

మీ అమూల్యమై న అభిప్రాయాలను కూడా తెలియజేయగలరు.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే అసలు తెలుగంటే , ముఖ్యంగా మనతెలుగు వాళ్ళే హేళన చేస్తుంటారు మాట్లాడాలంటే వారికీ నామోషీ .ఈ కంప్యుటర్ యుగంలో ధనార్జన కోసం వలస వచ్చినవారు ముఖ్యంగా స్త్రీలు వంద మెలికలు తిరుగుతారు తెలుగే రానట్టు మిగిలిన ఏ ఇతర భాషల వాళ్ళు వారి భాషను వదులుకోరు .కనీసమ్ అది గమనించిన మనవారు మారాలి మన ఆత్మ గౌరవాన్ని , వ్యక్తిత్వాన్ని మనం మాత్రం ఎందుకు చంపు కోవాలి?. వృత్తీ రీత్యా వచ్చినంత మాత్రాన మన భాషా సంస్కృతీ సంప్రదాయాలను వదులు కోవలసిన అవుసరం లేదే .నిజానికి భారతీయ సంస్కృతిని ఎంతగానో మెచ్చు కునే ఇతర దెసస్తులకి మనం చులకన కాకూడదు కదా !! అందుకు ముఖ్యంగా స్త్రీలు మారాలి .తల్లియె మొదటి గురువు గనుక పిల్లలకీ మిగిలిన అన్నిటితోపాటుగా మనతెలుగు , మనసంస్క్రుతీ సాంప్రదాయాలను పిల్లలకి నేర్పాలి ఇది ఖచ్చితంగా అమ్మలు అమ్మమ్మలు చేయ వలసిన పని. అప్పుడు కనీసం ముందు తరాని కైనా తెలుగు వెలుగులు వెల్లి విరియ గలవని ఆశిద్దాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.