జైశ్రీరాం.
శ్లో: వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి
రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం
ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివాంభో
లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రమ్.
క: పులివలె పయిఁబడు వృద్ధత,
పలు రోగములావహించు, పగిలిన కుండన్
నిలువని నీరటులాయువు
తొలగును. మరి దుష్ట బుద్ధి తొలగదదేలో?
భావము: ముసలితనము ఆడపులివలె చూపుడు వ్రేలితో బెదిరించుచున్నది. శత్రువులు వలె రోగాలు దేహమును హరించుచున్నవి. పగిలిన కుండలోని నీరు వలె ఆయుర్దాయము తరిగిపోవుచున్నది.ఐనప్పటికీ లోకం అహితకార్యములు చేయుచునే యుండుట ఆశ్చర్యం!
జైహింద్.
2 comments:
అయ్యా! శుభాశీస్సులు.
మాదొక చిన్న ప్రయత్నము:
ముదిమి పైబడు నొక పెద్ద పులికి బోలె
నావహించును రోగమ్ము లరుల మాడ్కి
చిల్లి కుండలో జలమట్లు చెల్లు నాయు
వయ్యు చెడుబుద్ధి తొలగదేలయ్య బళిర!
నమస్కారములు
క్షమించాలి ఈ మధ్య కొద్ది రోజులుగా సిస్టం బాగులేక ఆంద్రామృతాన్నిమిస్సయ్యాను . ఇప్పుడు మళ్ళీ అద్రుష్టం లభించింది.కొత్త సిస్టం వచ్చింది
చాలా మంచి పద్యం చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.