గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, నవంబర్ 2013, ఆదివారం

శివ భక్తుని గుండెలలో కూడా దాగి ఉండే శ్రీహరి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! వీరశైవ భక్తి భావ పూరిత పద్యం తిలకించండి.
క:- కనుచును వినుచును హర భా
వనమే మేల్ తలప! హరుని పదముల్ ఘన రీ
తిని వినుతింతు  రిపుందమ 
ను నిరతము మధురతర సహనుత రీతులతోన్.
ఇంత వీర శైవంలోనూ హరి భక్తి కూడా ఎంత చక్కగా కనఁబడకుండా దాగి ఉందో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
పై పద్యం నక్షత్ర బంధంలో లిఖించినట్లైతే ఆ అంతర్యామి ఏ భక్తుని హృదయాలలోనైనా ఎంత బాగా ఒదిగిపోతాడో అర్థమౌతుంది.
గమనించండి.
కోణములందు:- కరివరద!
కేంద్రములందు:- వినుత హరీ!
కేవలం మన ఆంధ్ర భాషలో మాత్రమే సుప్రశస్తమయిన చిత్ర కవితామృతాన్ని గ్రహించి, విరచించి, ఆంధ్రామృతం ద్వారా అందించే భాగ్యం కలుగఁ జేయుచున్న ఆ పరమాత్మకు, ఆంధ్రామృత పానలోలురకు కృతజ్ఞతలు చెప్పుకొనుట తప్ప మరేవిధముగా ఋణం తీర్చుకో గలను.
ధన్యవాదములు.
జైహింద్.
Print this post

3 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

హరుని ' స్టారు ' ను జేసి అందులోనే హరిని ' మాస్టారు ' గా నిలిపారు..అద్భుతమండీ..
' స్టారు ' లేక ' మాస్టారు' లేడు.. ' మాస్టారు ' లోనే ' స్టారు ' ఉంటాడు...

అజ్ఞాత చెప్పారు...

పైగా పంచముఖునికి పంచకోణ యంత్రం చాలా సమంజసం గా వుంది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చంద్ర శేఖరుని నక్షత్ర బంధనం జేసిన ఘనత సరస్వతీ పుత్రులకు తప్ప మరెవరికి సాధ్య మౌతుంది ? హేట్సాఫ్ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.