గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, నవంబర్ 2013, గురువారం

శ్రీ కందుల వర ప్రసాదిత ఆటవెలది గర్భ తేటగీతి

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ కందుల వర ప్రసాద్ ఇలా అత్యద్భుతమైన పద్య రచనా ప్రయత్నము చేస్తున్నారువారి అనిభవాన్ని ఇలా వ్రాశారు.   తిలకించండి.
కందుల వర ప్రసాద్ 
శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు ధన్యవాదములతో...
మీరు చేస్తున్న సాహిత్య సేవ ముందు నేనొక చిట్టెలుకను . మీ "ఆంద్రామృతం " ను  కొద్దిగా సేవించుటకు అనుమతి నిడుమని ప్రార్థిస్తూ...    
మీ బ్లాగు జూచిన తరువాత నేనొక గర్భ కవిత ( తేట గీతి / ఆట వెలది) వ్రాసితిని.  
మేము ది 18/04/2013 కేరళ నుండి కర్ణాటక వచ్చునపుడు బండిపుర  " వీరప్పన్ " సంచరించు అడవిలో ఏనుగు దాడి జేయ బోయి కనికరించినది. అది మీకు పంపుచుంటిని.   
ఆటవెలది గర్భ తేటగీతి :-
గజగజ వణికితిమి  గజ గమనము గని 
పద పద యనుచు  వడి వడి పరుగిడ నట  
కదలక నిలచె  కడు కనికరమున నది 
మరి మరి దలచితిమి  హరి హర సుత యని.   
ఇంతటి మహనీయమైన పద్య రచనా కృషి చేయుచున్న సాహితీ ప్రియులైన శ్రీ కంది వరప్రసాదును మనసారా అభినందిస్తున్నాను.
ఆటవెలది కంద గర్భ తేటగీతి
కందులవరవంశఘనుఁడ వందును నిను
గర్భకవితవ్రాసిఘనుఁడుగనయితివిగ!
అందిన సుధ చింద నమరి, సింధు వవగ
నిష్ట రచన చేయుమికవని నెద నిలువ.
ఆ.వె.:-
కందులవరవంశఘనుఁడ.వందునునిను
గర్భకవితవ్రాసిఘనుఁడుగనయితివిగ!
అందిన సుధ చింద నమరి, సింధు వవగ
నిష్ట రచన చేయుమికవనినెద .
క:-
కందులవరవంశఘనుఁడ
వందునునినుగర్భకవితవ్రాసిఘనుఁడుగన్!
అందిన సుధ చింద నమరి, 
సింధు వవగనిష్ట రచన చేయుమికవనిన్.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

A very good presentation. Congratulations 7 Best wishes to Sri Varaprasad.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రసాద్ గారి పద్యములు బాగున్నవి ఆంద్రామృతం గ్రోలిన పిమ్మట ఇంకేముంది ?
ఖచ్చితముగా పండితులు కావలసిందే సరస్వతీ పుత్రు లైన శ్రీ చింతా వారి అమూల్య మైన సాంగత్యం ఇంకెన్నెన్నో బంధాలను వ్రాయిం చ గలదు
సోదరులకు శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.