జైశ్రీరామ్.
ఆర్యులారా!
ఈరోజు శ్రీహరి మత్స్యావతారము దాత్చి మనలను కరుణించిన పుణ్యప్రదమైన రోజు.
ఈ సందర్భముగా రచించిన విశ్వముఖ మత్స్యత్రయ బంధము తిలకించండి.
కమల దళాక్షుఁ గాంచఁ గల కన్నులు, కన్నులు, మోదమందుచున్,
విమల చరిత్రు గాధ విను వీనులు వీనులు భ్రాంతి చెందుచున్,
ప్రమదము శ్రీహరిన్ బలుకు వాతెర వాతెర, భావమెన్నుచున్
సుమతుల నెన్నుచున్ మదిని శోభిలుచున్, పరమాత్మఁ గాంచుచున్.
ఆంధ్రామృత పాఠకులకు ఆ శ్రీహరి దీవెనలు ఎల్లప్పుడూ లభించుగాక.
జైహింద్.
9 comments:
మ్రుచ్చు సోమకు ద్రుంచిన లచ్చి మగని
చేప రూపాన వేదాల తాపి దెలిసి
తెచ్చి నలువకు నిచ్చిన దివ్య పురుషు
మత్స్య మందున నుంచిరి మాటు వేసి!
Dear Rama Krishna garu
I have seen your poem. I wholeheartedly express my sincere thanks and appreciate efforts.
with regards
D V G A Somayajulu
Lanka Giri
విచిత్ర రీతులలో పద్యాలను అల్లడంలో మీకు మీరే సాటి.
నమస్సులు, గిరి.
ఆంధ్రామృతాన్ని అభిమానంతో గ్రోలి, అమూల్యమైన అభిప్రాయాలను అందించిన శ్రీ మిస్సన్న గారికి, శ్రీ డి.వి.జి.ఎ.సోమయాజులు గారికి, చిరంజీవి లంక గిరిధర్ కు ధన్యవాదములు.
నమస్కారములు
చిత్ర విచిత్ర మైన బంధ ములతో మమ్మల్నేగాక భగవంతుని సైతం బధించ గల ప్రతిభా వంతులు చిరం జీవి రామకృష్ణా రావుగారికి అభి నందనలు .వారిలోని సరస్వతీ దేవికి శిరసాభి వందనములు
ఆర్యా ! నమస్కారములు...'కమలాక్షు నర్చించు కరములు కరములు' వలె
చక్కని పద్యము క్రొత్త బంధంలో చెప్పారు. బాగుంది.
కన్నులు మూయని చేపగ
వెన్నుడు తా జూచి గాచు విశ్వమునంతా
సన్నుతి జేసిన వానిని
చెన్నుగ రక్షించు ప్రేమచే పగలేకన్.
పద్యాన్ని చూడగానే నాకు ఇందులో బంధమెక్కడుందా అని సందేహం కలిగినా, తరువాత చున్ముఖమీనాలను చూచాక ఆ మూడిటి బంధమేమిటో అర్థమయ్యింది. బాగుందండీ.
నమస్సులతో
ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ
ఈ బంధానికి "విశ్వముఖ.." అని పేరెందుకు పెట్టినట్టంటారు?
ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ
ప్రియమైన కిరణ్. మీ సందేహన్ని శ్రీ గోలి హనుమచ్ఛాస్రి గారి వ్యాఖ్యలో ఉన్న కందమే నివృత్తి చేస్యుంది. చూడ వచ్చును.
కన్నులు మూయని చేపగ
వెన్నుడు తా జూచి గాచు విశ్వమునంతా
సన్నుతి జేసిన వానిని
చెన్నుగ రక్షించు ప్రేమచే పగలేకన్.
మహా కవి కాణాదం పెద్దన సోమయాజి కృత అధ్యాత్మ రామాయణం లోని విశ్వ ముఖ మత్స్యత్రయ బంధ చంపకము కలదు.09-10-2013 వతేదీన ఆంధ్రామృతలో ప్రచురితమయినది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.