జైశ్రీరామ్.
సాహితీ మిత్రులారా! నేడు శుభప్రదమైన శ్రీ విజయ నామ సంవత్సర విజయ దశమి. ఈ సందర్భముగా మానవ జాతికంతటికీ శుభాలు చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఏ తల్లి చిరు నవ్వు లెల్ల లోకాలను చూచుచు నిరతము కాచు చుండు,
ఏ తల్లి చిరునవ్వు లెట్టి దుర్మతినైన సద్వర్తునిగ భువి సలుపుచుండు,
ఏ తల్లి చిరునవ్వు లిహ పర సౌఖ్యమ్ము లెల్ల సుకవి పాళి కిచ్చి, బ్రోచు,
ఏ తల్లి చిరునవ్వు లీ సృష్టి మూలమై మంగళప్రదమునై మహిమఁ గాచు,
నట్టి యా తల్లి చిరునవ్వు లనుపమ గతి
పొంద, సేవించి, ధన్యులౌ పుణ్య మతుల
పాద ధూళియె శుభదంబు. భక్త పాళి
నరసి దుర్గమ్మ రక్షించి, హాయి గొలుపు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
విజయ దశమి సందర్భముగా అందరికీ శుభా కాంక్షలు
ధన్య వాదములతో
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.