గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, అక్టోబర్ 2013, శనివారం

శ్రీ అనంత భాస్కర శతకము సమీక్ష. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
అభినందన మందారం.
చింతా రామ కృష్ణా రావు.
శ్రీ అనంత భాస్కర శతక కర్త  శ్రీ నారుమంచి అనంత కృష్ణ  గారు నాకు సుపరిచితులు శతకముకంటే ముందు వీరు 168 శ్లోకములతో గురుసహస్ర నామావళిని,
"లలిత పదముల మది లలిత గొలుతుఅనే మకుటముతో  ఒక శతకము, "వరసిద్ధి వినాయక భక్త పాలకాఅనే మకుటముతో ఒకశతకము రచించి యుండిరిఈవిషయమును శ్రీ అనంత భాస్కర శతకమున103  పద్యమున వియే చెప్పిరివీరి శతకరాజములు ఆంధ్రామృతము http://andhraamrutham.blogspot.com అనుబ్లాగున ప్రచురింపఁబడి పాఠకుల మన్ననలందుకొన్నవివీరు పద్య రచనలో స్థిత ప్రజ్ఞులుఐహికమగు రచనా వ్యాసంగముతో ఆముష్మికమును సాధించుటకు వీరుచేయుచున్న ప్రయత్నము వీరి రచనలో గోచరించునుఐహిక వాంఛా దూరులై పరమాత్మతో తాదాత్మ్యమయి పరమాత్మకు వీరు చేసుకొనుచున్న విన్నపము ప్రత్యక్షరసత్యమై శతక బద్ధమైయున్నది.
శ్లోఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్  -  శ్రియమిచ్ఛేద్ధుతాశనాత్.
జ్ఞానం మహేశ్వరాదిచ్ఛేత్. -  మోక్షమిచ్ఛేత్ జనార్దనాత్.
అని ఆర్యోక్తిఇందలి సత్యగ్రాహకులైన మారద వెంకయ్య  కవి మున్నగు వారు భాస్కర శతకాది నామములతో సూర్యు సంబంధమైన పెక్కు శతకములు విరచించిధన్యజీవులైరిఅందు మారద వెంకయ్య కవి కృత భాస్కర శతకము దృష్టాంతాలంకారాలంకృతమై యున్నందున నేటికినీ ప్రజల నాల్కలపై నానుచుండుట విశేషమునాటి మన కవి అనంత కృష్ణ గారు కూడా తనకు గల అపార కవితా ప్రాభవముతో చిత్ర , బంధనామ గోపనాది చిత్ర కవితా వైచిత్రీ ప్రాభవముతో శతకము మొత్తము వ్రాయుసమర్ధులయ్యునుభక్తి భావనాభరితమగు సీసములను వెలయించుచు అటనట కొన్ని పద్యములలో తనకు గల చిత్ర కవితాసక్తికి మచ్చు తునకలుగా వ్రాసిభక్తులమనములతోఁ బాటు కవితానురక్తులగు మహా కవుల హృదయములను సహితము చూఱకొనిరి.
శ్రీ కారముతో నారంభించిన యీ శతకము   సీస సంభరితము కాగా సీసాంతమునుండు తేట గీతిలో చివరి రెండు పాదములందు మకుటమునుంచిరి.
భాస్కరాదిత్య ! ఘృణి సంజ్ఞభక్త వరద!
దివసకరవరేణ్య ! సవితాతిగ్మ కిరణ!           
 మకుటమునందు  సూర్య భగవానుని నామములు తప్ప మరొకటి లేకుండుట గమనించినచో  కవికి గల భక్తి తత్పరత వ్యక్తము కాక మానదు.
 లోకము యొక్క సృష్టిస్థితిలయలకు మూలము బ్రహ్మవిష్ణుమహేశ్వరులు కాగా  మూడు మూర్తుల ప్రత్యక్ష సాక్షి సూర్యభగవానుఁడే.
శ్లోఉదయం బ్రహ్మ స్వరూపం  -  మధ్యాహ్నంచ మహేశ్వరం,
సాయంకాలే సదా విష్ణుం  -  త్రిమూర్తిశ్చ దివాకరః . ని ఆర్యోక్తి.
మనకవి ఇందలి సత్య గ్రహణ పారీణుఁడగుటను చేసి
రెండవ పద్యములో  విషయమును సోదాహరణముగా వివరించి"మూడు మూర్తులు నీవైన మూల పురుష  -  నిజము నెఱుఁగంగ మనసార నిన్ను కొలుతు"అని తెలిపి యున్నారుకవిగా తాను తరించుటయే కాక తన పుత్ర పౌత్రబాంధవాది భక్త జనుల నామములనంతర్లీనముగా విరచించి  పరమాత్మతో సీసములలోముచ్చటించుట చూచినచో ఎట్టివారికైనా అబ్బురము కలుగక మానదు. 8 , 13 , 49  పద్యములలో "సరోజ - శర్మ - అనంత - వనజ - కౌశిక్ - శృత కీర్తి - అపర్ణ -రఘురాం - కుమారి - పాండు - గీత - భరద్వాజ - కశ్యప - హాసిని - సహస్ర కౌముది మున్నుగా కల వారి బంధువుల నామములు మనము గమనించ వచ్చును.
వీరు రచించిన సాధారణమగు సీసములలో అసాధారణ మగు  "ఘృణి సూర్య ఆదిత్య ఓం" అనే  పదముల సమాహారము "మూల శక్తిగా కనపడునట్లు చేసెను..6 పద్యము దీనికి నిదర్శనము.
 కవి గర్భ కవితా ధురీణుఁడనుటకు  క్రింది పద్యమే తార్కాణముగమనింపుడు.
సీమాయను జిక్కుట మది నూహ జేయగా  -  రానిది తగులగ రాదనంచు   
వారింప శక్యమేవాక్కున పల్కుటె  -  టులనిశ్చల గతులన్ గలుగు టెటుల
దాయక తెల్పుము తదుపాసనా సుసా  -  ధ్యమ్మది చెందగ నెమ్మది గొన   
నీ యనుకంపయౌ నిర్గుణ సత్యము  -  తృటినందెడివిధమున్ తెలియనెంతు
గీఆటుపోటులఁ జిక్కక నటునిటులను  -  బారక గమనమాగని బాట జూపు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద  -  దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ 14
 పద్యమును పఠించునెడ మనకు సీసముగనే తోచును కాని ఇందు ఒక కంద పద్యము గర్భితమై యున్నదను విషయము చెప్పిన గాని తెలియదు.
ఇందలి కంద పద్యమును గమనింపుడు.
సీస గర్భస్థ కందము
మది నూహ జేయగారా
నిది వాక్కున పల్కుటెటులనిశ్చల గతులన్
తదుపాసనా సుసాధ్య
మ్మది నిర్గుణ సత్యము తృటినందెడివిధమున్.
పద్య రచనమున పారమంటిన కవులు చేయు ప్రక్రియ చిత్ర కవిత యని కవిత్వ తత్వ వేత్తల భావనఅక్షర నియమమును బట్టి (1)ఏకాక్షర చిత్రము - (2)ద్వ్యక్షర చిత్రము - (3)త్ర్యక్షర చిత్రము - (4)చతురక్షర చిత్రము అను నాల్గు ప్రక్రియలను మన కవి నాలుగు పాదములందు చూపియున్నారు.
సీ: నేను నేనను నేను నేనని నేననన్  -  నేనన్న నేనన్న నిన్ను నిన్నె(1)
నా మనమన్న నీ నామమ్మనిన్ నమ్ము  -  నీ నామ మననమ్ము నెమ్మి నిమ్ము(2)
సుమ సమానము మానసమనుమానము మాని  -  నా మనో సుమమాసన మనుమన్న(3)
నీ యెద దాగని నీ దయ నేగొందు  -  నాదగు నయ్యది నాదెయందు(4)
గీ: వేనవేల మాటలవేల వేడికొందు  -  నెల్ల వేళల నుండు నా యుల్లమందు
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద   -  దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                 85
చిత్ర బంధ రచనా దక్షులయిన మన కవి 100  పద్యముగా రథ బంధ సీసమును రచించెనుఅందు కవి నామము - గ్రంథ నామము నిక్షేపించుటను వీరికి గల చిత్ర కవితాపాటవమునకు తార్కాణముగా చెప్ప వచ్చునుగమనింపుడు.

రథ బంధమున మధ్య నిలువు అనంత కృష్ణ భాస్కర శతకము" అని వచ్చును.
సీఅవునంతియే గీతలన్నియు స్వీయాకృ  -  తిం  దప్పి యే మృగతృష్ణ వెంట
పరువెత్తి సోలక భాసుర పరిపూర్ణ  -  నిరుపమహస్కర నియతి నిల్పు
శుభచిహ్న సారమై శోభావహమ్ములై  -  నిల్చు శక్తిని పొంద నీదగు దయ
తప్ప యితరమెద దలప కన్పట్టదు  -  ముఖ్య గుణమటుల ముఖము పైన
గీముచ్చట నుదుట వ్రాయక మునుపు దేవ  -  నతులు గొని సమ్మతిని జూపుమతులితముగ 
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద  -  దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                            100
అనంతుఁడగు  దినకరుఁడే అనంతుఁడయ్యెనో యేమో గానిఅనంత కృష్ణ కవి మాటల మేళనమునందు కూడా దినకర మంత్రమునే ప్రభవింప జేసినారు.23  పద్యమునగల వీటిని గమనింపుడు.
అందిన కరమందుకొందనిన్  - పొందిన కరదీప - కుందిన కరవాల - భయమొందిన కరణి.
 కవి కవితా భేషజము   క్రింది పద్యము వలన తెల్లమగుచున్నది"దారిద్ర్య దుఃఖాలు దరిదాపులకు రావుఅని భరోసా యిచ్చుచూఅందులకు ఏమి చేయవలెనో  క్రింది పద్యమున వివరించిరిచూడుడు.
సీరాగి చెంబెడు నీట రక్త చందనముంచి - ఎర్ర గన్నేరులనెంచి యుంచి
దూర్వాంకురములుంచి తోడునక్షతలుంచి - కుదురుగా చేపట్టి నుదురుకాన్చి
మోకాళ్ళ పై నిల్చి ముదమార నిను తల్చి - హంసాది నామాల నర్ఘ్యమీయ
దారిద్ర్య దుఃఖాలు దరిదాపులకు రావు - వాని జేరగలేవు వ్యాధులసలు
గీనీటితో పూజించ మురిసి కన్నీటినంత - చేత తుడిచెడి నిను గొల్తు చేతులెత్తి
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద  - దివసకర  వరేణ్య సవితా తిగ్మ కిరణ                   79
"సకల దీప్తుల దీపించు శక్తివీవుఅని సూర్య భగవానుని 80  పద్యమున నిరూపించిన తీరు గణనీయము.
శ్రీమదనంత కృష్ణ కవి తన "శ్రీ అనంత భాస్కర శతకము"ను  సూర్య భగవానునకే అంకితము చేయుచూ 102  పద్యమున  పరమాత్మను గైకొమ్మనివిన్నవించుకొనిరి.
త్రికరణ శుద్ధిగా సూర్య భగవానునకే అంకితమయిన యీ మహా కవి తాను రచించిన శ్రీ అనంత భాస్కర శతకము  దినకరునకే అంకితమిచ్చి  కృతకృత్యులైరని చెప్పవచ్చును.
ప్రతీ పద్యమునా ఏదో ఒక చమత్కారము కనబడుచున్నప్పటికీ విస్తరణ భీతిచే వివరింపలేకుంటినిశ్రీఅనంత కృష్ణ కవి రుని మనసారా అభినందించుచున్నాను.
సప్త వింశత్యధిక ద్వివిధ కంద - గీత గర్భ చంపకమాల:-
ఘృణి ధరుఁడై సదాకవికి శ్రీకరముల్ రవి కాంచ చేయగా
మునివరుఁడై మదిన్ నిరతమున్ వరభాస్కరునే గణించెభా
వన వరుఁడే కదా!.అమృత భాస్కర తేజుఁడనంత కృష్ణ సా
ధన గురుఁడై భువిన్ హరి సుధార్త రమాన్వితుడై సుఖించుతన్.
మంగళప్రదుఁడగు  సూర్య భగవానుఁడే  మహాకవికి నిత్యము సర్వమంగళ కారకుఁడగును గాక.
స్వస్తి.
జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.