గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, అక్టోబర్ 2013, శుక్రవారం

శ్రీ అనంత భాస్కర శతకము ఆవిష్కరణ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ సృష్టిని నిరంతరము నడుపుచున్న ప్రత్యక్ష సాక్షియైన ఆ భాస్కరుని కరుణా రస తరంగిణిలో ఓలలాడుతూ తాదాత్మ్యంతో మిత్రులు శ్రీ నారుమంచి అనంత కృష్ణ కవి శ్రీ అనంత భాస్కర శతకమును సీసపద్యములలో అటనట గర్భ, చిత్ర బంధ, నామ గోపన చిత్రాదులతో అలంకరించి ఆ సూర్యభగవదర్పితం చేస్తున్నారు. ఈ శతకావిష్కరణ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం జరుగనున్నదని తెలియ జేయుటకు సంతసించుచున్నాను.
సహృదయులైన మీ అందరూ ఆహ్వానితులే.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవి సామ్రాట్టులకు ప్రణా మములు
బ్రహ్మశ్రీ శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి అభినందన మందారములు
సభా విశేషములను తెలుప గోరిన ముదావహం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.