గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, అక్టోబర్ 2013, గురువారం

18 పురాణాలు - అందలి శ్లోకాల సంఖ్య, 18 ఉప పురాణాలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మనలో నిబిడీకృతమై ఉన్న జ్ఞానాగ్ని నిరంతర చింతన, విమర్శన, అన్వేషణ అనే ఇంధనంతో ప్రజ్వలింప జేయకపోయినట్లైతే క్రమంగా నశించిపోవడం దాని ప్రకృతి ధర్మం.కావున మనం తెలిసిన విషయాలే ఐనప్పటికీ పదే పదే చర్చించుకోవడం ద్వారా, నెమరువేసుకోవడం ద్వారా ప్రజ్వలింప జేయ వచ్చును. ఇప్పుడు మనం అష్టాదశ పురాణాలు, అందలి శ్లోక సంఖ్య, - అష్టాదశ ఉప పురాణాలు గూర్చి ఒక్కమారు అనుకొందాం.
అష్టాదశ (18) పురాణాలు అనే మాట విన్నాం కదా! అవి ఏమి టేమిటి? వాటిలోని శ్లోక సంఖ్య ఎంతెంత? అనేవి సవివరంగా తెలుసుకోవాలనుందా? ఐతే చూడండి.
వ్యాసమహర్షి కృతమైన ఈ పురాణాలన్నీ గుర్తుపెట్టుకోడానికి అనువుగా, వాటి పేర్ల మొదటి అక్షరాలతో ఉండే ఈ శ్లోకం చూడండి.
శ్లో|| మద్వయం భద్వయం చైవ బ్ర త్రయం వ చతుష్టయమ్‌ |
- నా - పద్ - లిం - - కూ - స్కాని పురాణాని పృథక్‌ పృథక్‌ ||
1. మత్స్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ( 'మ'  ద్వయం)
2. మార్కండేయ పురాణం - శ్లోకాల సంఖ్య : 9,000
3. భవిష్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ( 'భ'  ద్వయం)
4. భాగవత పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000
5. బ్రహ్మ పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000 ( 'బ్ర'  త్రయం)
6. బ్రహ్మాండ పురాణం - శ్లోకాల సంఖ్య : 12,000
7. బ్రహ్మ వైవర్త పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000
8. వామన పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000
9. వాయు పురాణం - శ్లోకాల సంఖ్య : 24,600
10. విష్ణుపురాణం - శ్లోకాల సంఖ్య : 23,000 ( 'వ' చతుష్టయం)
11. వరాహ పురాణం - శ్లోకాల సంఖ్య : 24,000
12. అగ్ని పురాణం - శ్లోక సంఖ్య : 16,000 - అ
13. నారద పురణం - శ్లోక సంఖ్య : 25,000 - నా
14 పద్మ పురణం - శ్లోక సంఖ్య : 55,000 - ప
15. లింగ పురాణం - శ్లోక సంఖ్య : 11,000 - లిం
16. గరుడ పురాణం - శ్లోక సంఖ్య : 19,000 - గ
17. కూర్మపురాణం - శ్లోక సంఖ్య : 17,000 - కూ
18. స్కాంద పురాణం - శ్లోక సంఖ్య : 81,000 - స్కా
ఇవికాక
18 ఉప పురాణాలున్నాయి. అవి :
1. సనత్కుమార పురాణం, 2. సాంబ పురాణం, 3. సౌర పురాణం, 4. నారసింహ పురాణం, 5. నారదీయ పురాణం, 6. వారుణ పురాణం, 7. వాసిష్ఠ పురాణం, 8. కాపిల పురాణం, 9. కాళికా పురాణం, 10. దౌర్వాస పురాణం, 11. ఔశసన పురాణం, 12. ఆదిత్య పురాణం, 13. మాహేశ్వర పురాణం, 14. శివపురాణం, 15. భాగవత పురాణం, 16. పారశర పురాణం, 17. నంది పురాణం, 18. మానవ పురాణం.
ఇప్పటికివి చాలు.
జైహింద్.
Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

మంచి సమాచారం.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పురాణ ముల పేర్లను ఇమిడిఉన్న మంచి శ్లోకాన్ని అందించి , వాటి వివరణ ఇచ్చి నందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.