క:-
ప్రియ పాఠక సద్బంధులు
దయనీ సీసమును చదివి దానిని కల నా
ప్రియమైన ప్రశ్న కుత్తర
మయినది తెలుపంగ గలరె? ఖ్యాతిగ మీరల్?
సీ:-
ముద్దులొలుకు మోము, మురిపించు పలుకు, చె
క్కు చెదరని నగవు, సుచరితమును,
రాగము తీసిన రంజిల్ల జేసెడు
ఘనమైన సత్కీర్తి కలయతండు,
వరగుణాన్విత పుణ్య భరణ కౌశలుఁడును,
కినుక నెఱుగనట్టి వినుతుఁడు. కుద
రణ్ డు దుష్టుల దరి. ప్రఖ్యాత విజ్ఞాని,
నా సత్ప్రబంధముల్ నచ్చి మెచ్చు.
గీ:-
మంచి మర్యాద లెఱిగిన మాన్యుఁడతఁడు.
జైశ్రీరాం
జైహింద్.
Print this post
ప్రియ పాఠక సద్బంధులు
దయనీ సీసమును చదివి దానిని కల నా
ప్రియమైన ప్రశ్న కుత్తర
మయినది తెలుపంగ గలరె? ఖ్యాతిగ మీరల్?
సీ:-
ముద్దులొలుకు మోము, మురిపించు పలుకు, చె
క్కు చెదరని నగవు, సుచరితమును,
రాగము తీసిన రంజిల్ల జేసెడు
ఘనమైన సత్కీర్తి కలయతండు,
వరగుణాన్విత పుణ్య భరణ కౌశలుఁడును,
కినుక నెఱుగనట్టి వినుతుఁడు. కుద
రణ్ డు దుష్టుల దరి. ప్రఖ్యాత విజ్ఞాని,
నా సత్ప్రబంధముల్ నచ్చి మెచ్చు.
గీ:-
మంచి మర్యాద లెఱిగిన మాన్యుఁడతఁడు.
మహిత సద్భావ సౌశీల్య మర్త్యుఁడతఁడు.
తత్వ వేత్తయు నాతఁడు సత్వ భావుఁ
డు. తెలుపుఁడతడెవ్వడగు?వాఁడు తెలియ దగు. జైశ్రీరాం
జైహింద్.
19 comments:
గొప్ప వ్యక్తిని పొగిడేటప్పుడు కవులు వాడే విశేషణాలే కదా ఇవన్నీ. పద్యంలో ఆవ్యక్తికి చెందిన ఒక్క క్లూ కూడా విశేషణ రూపంలో కనిపించక పోతే ఎవరని చెప్పేది మిత్రమా.
ఎవరబ్బా? బ్లాగు మిత్రులా? మీ కుటుంబ సభ్యులా? పురాణ పురుషులా??
క్లూ ఇవ్వకుండా ఎలాగడుగుతాననుకొన్నావు మిత్రమా! క్లూ ఉంది వెతికితే.
జ్యోతిగారూ!బ్లాగు మిత్రులేనండి.
కంది శంకరయ్య గారా ?!!!
ముక్కు రాఘవ కిరణ్
ప్రతీ లైను మొదటి అక్షరం తీసుకుంటే సరి
అజ్ఞాత మహోదయా!
శంకరయ్య గొప్ప సత్కవి ప్రేరక
చక్రవర్తి.కనగ చక్రి కారు.
శివులు వారు మదిని చితి మంట భరియించు.
నిండు కుండ వారు నిర్మల మతి.
ramudu
kottapali :)
ఎవరబ్బా ? డాక్టర్ .విష్ణు నందన్ గారా ? లేక , పూజ్యులు , గువులు , అవధాన సరస్వతులు , శ్రీ పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారా ? ఏమో మరి ?
సాయీ రాముఁడు సద్గుణ
దాయి. హృదయ సంస్థితుండు. దైవంబతఁడున్.
ధీయుతుఁడు జ్ఞాన కిరణుఁ
డీయుక్త వచో విలాసుడీ బాలుండున్.
భాస్క్ర వంశజ రాముఁడ
హస్కరు డతని కిరణ మననగు నితనిన్.
నిష్కాపట్యుఁడ! సుచరిత!
భాస్కర శ్రీ రామి రెడ్డి! ప్రథమలు గనుడీ!
" ముక్కు రాఘవ కిరణ్ నామ మతడు "
Mukku raaghava kiran naama matadu. Kaani naaku veerevaro teleedu. Just guess.!
సాహితీ ప్రియ బంధువులారా!
మీరు వ్యక్త పరచిన వ్యక్తులందరూ నా పద్యములో సూచించిన గుణ గణ్యులే. మీ నిర్ణయములు సరైనవే.
ఐతే ఈ సీస పద్యములో ఒక ప్రత్యేకత ఉంది.
ఇందు నామ గోపనము అనెడి చిత్ర రచనా ప్రక్రియ మీరు గమనించియే యుందురు.
ప్రతీ పాదమునందలు(సీసమున కాబట్టి ప్రతీఅర్థ పాదమునందలి) మొదటి అక్షరమునూ వరుసగా గ్రహించి కూర్చితే వచ్చే పేరు ఆవ్యక్తి యెవరన్నది తెలియ జేస్తుంది.
మీరూ గ్రహించి : ముక్కు రాఘవ కిర నామమతఁడు అని చక్కగా చెప్పిరి. మీ అందరి ఆసక్తినీ అభినందిస్తూ, ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
మిత్రమా, ఈ నామ గోపన ప్రక్రియతో నీవు నా పేరు వచ్చేలాగున ఒక పద్యం మనం కాలేజీలో చదువుకొనే రోజులలోనే, అంటే 1969 ప్రాంతాలలోనే ఒక పద్యం చెప్పినట్టు గుర్తు. కదా ?
పద్య ప్రియులకు చక్కని పోటీ పెట్టినందుకు నీకు నా అభినందనలు.
ఆర్యా ! పోస్టింగ్ ఆలస్యముగా చూచినాను. పోటీలో పాల్గొనలేక పోయాను.
సీసము నందున నామము
వ్రాసిన విధమెంత యేని రమ్యం బాయెన్
చూసిన వెంటనె తోచదు
చూసిన పాదంబు మొదలు చోద్యము తోచున్.
హనుమచ్ఛాస్త్రి గరూ. చక్కగా వివరించారంది ఆలస్యం సమస్యే కాదు. ధన్యవాదములు.
పం.జో. మిత్రమా! నీకు బాగానే గుర్తుంది. నిజమే. 1969 లో నీ పేరు, నాపేరు గోపనముచేసి సీసము వ్రాసి నీకు ఇచ్చాను.
ఆహా! మంచి మిత్రుడుంటే మంచి అభివృద్ధి కూడా ఉంటుందని నీ కారణంగా నేను పద్యం వ్రాయడమన్నది జరిగి నిరూపితమైంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.