గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2011, శనివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము56. అష్టదళ పద్మ బంధము.

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.  
ఈ చిత్ర కవి చేసిన  అష్టదళ పద్మ బంధమును చూడండి.
మాణవకము:-

సారా నేత్రాంత రసా.
సార తరంగావిరసా
సార విచారాసరసా
సార సమర్ధా సరసా.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సాహిత్యపు సుమ సౌరభాలను విర జిమ్ముతున్న" అష్టదళ పద్మం " అద్భుతంగా ఉంది . అంద మైన కావ్యాలను అందిస్తున్న చింతా వారు అభినంద నీయులు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.