శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.
క :-
అఖిల జగంబుల యందున
సుఖ జీవన భాగ్య మిచ్చి శోభిలఁ జేసే
నిఖిలేశ్వరి శ్రీదేవీ
సఖులగు సన్మాతృ తతిని శ్రీ కరుణించున్.
శా :-
లోకంబంతయు పద్మ నాభు సతి సంలోకామృతం బందగా
నేకాగ్రాత్ములుఁగా తపించు. సమయం బీనాడు లభ్యంబయెన్.
సాకారంబుగ దర్శనంబొసగు. సంసారాంధులం బ్రోచు నా
శ్రీ కల్యాణి సుఖంబు సంపదలతో క్షేమంబుఁ గొల్పుం గృపన్.
ఉ :-
సాగర కన్యకల్ కలరు చక్కగ నిద్దరు.వారి లోపలన్
వేగముఁ గల్గి చేరుటకు వేచెడు జ్యేష్ఠ మనన్.మహాత్మురా
లాగక మున్నుగానె మనసార మనన్ గరుణించి చేరు తా
నేగతినైన.భక్తి మహనీయత దెల్పగ సాధ్యమేరికిన్?
శా :-
ఆనందామృత పాన భాగ్యులయి మీరత్యంత సచ్ఛీలురై,
జ్ఞానాంభోజ పవిత్ర మూర్తులయి సత్కార్యంబులం జేయగా.
శ్రీనాధుండును విష్ణు పత్నియు కృపం జేకొంచు మిమ్మున్ స
ప్రాణంబట్టులఁ గాచు కావుత! మహద్భాగ్యంబు మీదే సుమా!
జై శ్రీరాం.
జైహింద్.
2 comments:
శ్రావణ శుక్ర వారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీకు మా శుభాకాంక్షలు. మీ పద్యాలు కడు రమణీయాలు. మీ వంటి కవి మిత్రులు నా ఆబాల్య స్నేహితులవడం నాకు ఎంతో గర్వ కారణం.
మిత్రమా!
గుణవరులైన సత్కవన కోవిద మిత్రు లనన్య లభ్యము
ధనముగ నాకు నబ్బ, కవితా ఝరి కల్గుట యబ్బురంబె? మీ
సునిశిత భావనా గరిమ సుందరతన్ విరచించి చూపు. నా
ఘనతగ తల్చినన్నదియు కాదనరాని భవత్ప్రభావమే.
ధన్యోస్మి.
ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.