చ:- అల చనువొప్పగా కరములందున యుండిన కారణంబు;నో
ముల ఫలమే కదా! యటన్ పరగ మోవిని తాకెడు భాగ్య మెన్నవే
ల్పుల ఘన భాగ్యమా మురళి పొందిన పుణ్యము; మోక్షమద్ది. ని
క్కలయ హరీ! యెటన్ వినగ; కాంచగ; నీ దయ. వేణు గోపకా! 86.
భావము:-
ఓ వేణుగోపకుఁడా! ఓ శ్రీహరీ! ఆ మురళి చనువుతో ప్రసిద్ధముగా నీ చేతులే నెలవుగా
కలిగియున్నట్టియు; అటుపిమ్మట ఒప్పెడి విధముగ నీ మోవిని తాకేటు వంటి భాగ్యము
- ఎన్నికతో చూచినట్లైతే దేవతలకు కలుగునటువంటి గొప్ప భాగ్యము. అది మురళి
పొందినటువంటి పుణ్యమే కదా! కారణమనగా అది ఆ మురళి పూర్వ జన్మలో నోచిన
నోము ఫలమే కదా! అది మోక్ష ప్రదమైనది. నిజముగా మారిన కల. ఈ మురళికి ఇంతటి
కలిగియున్నట్టియు; అటుపిమ్మట ఒప్పెడి విధముగ నీ మోవిని తాకేటు వంటి భాగ్యము
- ఎన్నికతో చూచినట్లైతే దేవతలకు కలుగునటువంటి గొప్ప భాగ్యము. అది మురళి
పొందినటువంటి పుణ్యమే కదా! కారణమనగా అది ఆ మురళి పూర్వ జన్మలో నోచిన
నోము ఫలమే కదా! అది మోక్ష ప్రదమైనది. నిజముగా మారిన కల. ఈ మురళికి ఇంతటి
భాగ్య మబ్బుట యనునది ఏమార్గమున వినినను; చూచినను; నీదయ వలననే కదా.
క:- చనువొప్పగా కరములం - దున యుండిన కారణంబు; నోములఫలమే
ఘన భాగ్యమా మురళి పొం - దిన పుణ్యము; మోక్ష మద్ది. నిక్కలయ హరీ! 86.
భావము:-
ఓ శ్రీహరీ! ఆ మురళి చనువుతో ప్రసిద్ధముగా నీ చేతులే నెలవుగా కలిగియున్నట్టి కారణము;
పూర్వ జన్మలో నోచిన నోము ఫలమే సుమా! ఇటువంటి గొప్ప భాగ్యము అది మురళి
పొందినటువంటి పుణ్యమే కదా! అది ఆ మురళికి నిజముగా మారిన కల. అది
మోక్ష ప్రదమైనది.
పూర్వ జన్మలో నోచిన నోము ఫలమే సుమా! ఇటువంటి గొప్ప భాగ్యము అది మురళి
పొందినటువంటి పుణ్యమే కదా! అది ఆ మురళికి నిజముగా మారిన కల. అది
మోక్ష ప్రదమైనది.
గీ:- కరములందున యుండిన కారణంబు; - పరగ మోవిని తాకెడు భాగ్య మెన్న
మురళి పొందిన పుణ్యము; మోక్షమద్ది. వినగ; కాంచగ; నీ దయ వేణు గోప! 86.
భావము:-
ఓ వేణుగోపుఁడా! ఆ మురళి నీ చేతులే నెలవుగా కలిగియుండుటకు గల కారణము;
నీ మోవిని తాకేటు వంటి భాగ్యము ఎన్నికతో చూచినట్లైతే అది మురళి పొందినటువంటి
పుణ్యమే సుమా! అది మోక్ష ప్రదమైనది. వినినను; చూచినను; ఇది నీదయయే సుమా!.
నీ మోవిని తాకేటు వంటి భాగ్యము ఎన్నికతో చూచినట్లైతే అది మురళి పొందినటువంటి
పుణ్యమే సుమా! అది మోక్ష ప్రదమైనది. వినినను; చూచినను; ఇది నీదయయే సుమా!.
చ:- ఘనతలఁ గాంచితిన్. నెమలి కన్నులు కానగ నెత్తి కెక్కె; నో
చెనొ? సుకృతిన్ గనన్. మురళిఁ చెక్కిలి నద్దియు మోవిఁ జేరె .క్రే
ణిని; వలపించుచున్ కమల నేత్రలు చేరిరి కౌగిలించ; ర
మ్య! నరహరీ! నినున్ వెదకు మార్గముఁ జూపుమ! వేణు గోపకా! 87.
భావము:-
ఓ వేణుగోపకుఁడా! రమ్యుఁడవైన ఓ నరహరీ! గొప్పలను చూచితిని. చూడగా నెమలికన్ను
నీ నెత్తి పైకెక్కెను. అదిఅంతటి నోము నోచెనా యేమి? పుణ్యమును పొందుటకు ఆ మురళి
నీ చెక్కిలి నంటుటయే కాక ఏమాత్రమూ లెక్క చేయక నీ పెదవులను చేరెను. ఈ భూమిపై
నిన్ను వలపించుచు గోపికలు; నిన్ను కౌగిలించుకొనుటకు చేరిరి. నిన్నువెదకెడి మార్గమును
మాకు చూపుము!
నీ నెత్తి పైకెక్కెను. అదిఅంతటి నోము నోచెనా యేమి? పుణ్యమును పొందుటకు ఆ మురళి
నీ చెక్కిలి నంటుటయే కాక ఏమాత్రమూ లెక్క చేయక నీ పెదవులను చేరెను. ఈ భూమిపై
నిన్ను వలపించుచు గోపికలు; నిన్ను కౌగిలించుకొనుటకు చేరిరి. నిన్నువెదకెడి మార్గమును
మాకు చూపుము!
క:- తల గాంచితిన్. నెమలి క - న్నులు కానగ నెత్తి కెక్కె ; నోచెనొ? సుకృతిన్
వలపించుచున్ కమల నే - త్రలు చేరిరి కౌగిలించ రమ్య నరహరీ! 87.
భావము:-
రమ్యుఁడవైన ఓ నరహరీ! నీ తలను చూడగా నెమలికన్నులే అందరూ చూచు విధముగ
నీ నెత్తిపైకెక్కెను. అవి ఏ నోము నోచెనో కదా! చేయఁ బడిన పుణ్య ఫలముగా ఈ భూమిపై
నిన్ను వలపించుచు ఆ గోపికలు కౌగలించు కొనుటకై నిన్నుశ్రద్ధతో చేరిరి కదా!
నీ నెత్తిపైకెక్కెను. అవి ఏ నోము నోచెనో కదా! చేయఁ బడిన పుణ్య ఫలముగా ఈ భూమిపై
నిన్ను వలపించుచు ఆ గోపికలు కౌగలించు కొనుటకై నిన్నుశ్రద్ధతో చేరిరి కదా!
కమల నేత్రలు చేసిరి కౌగిలించ! - వెదకు మార్గముఁ జూపుమ! వేణు గోప! 87.
భావము:-
ఓ వేణుగోపుఁడా! చూడగా నెమలికన్ను నీ నెత్తిపైకెక్కెను. ఆ మురళి నీ చెక్కిలి నంటుటయే
కాక ఏమాత్రమూ లెక్క చేయక. నీ పెదవులను చేరెను. గోపికలు నిన్ను కౌగిలించుకొనుటకు
చేరిరి. నిన్నువెదకెడి మార్గమును మాకు చూపుము!
కాక ఏమాత్రమూ లెక్క చేయక. నీ పెదవులను చేరెను. గోపికలు నిన్ను కౌగిలించుకొనుటకు
చేరిరి. నిన్నువెదకెడి మార్గమును మాకు చూపుము!
తలపగ నేర్వనే! అటుల ధాత్రిని నిల్పిన యట్లెనిల్పితే!
పలు వర భావనల్ సుధలు పంచ రసాదిగ చొక్కఁ జేతు; స
త్ఫలద హరీ! ఎటుల్ వెలయ దక్షతఁ జేతువు? వేణు గోపకా! 88.
భావము:-
ఓ వేణుగోపకుఁడా! మంచి ఫలితములను ప్రసాదించు ఓ శ్రీహరీ! పరమాణువునుండి
అనంతమైన గొప్పవైన రసాతలాదిగా గల సుప్రసిద్ధమైన చతుర్దశ భువనములను వాటిని కనీసము తలచుటకైనను చేతకానివారమే మేము. నీవు దక్షతతో ఆ విధముగ
భూమిని వలె అన్నియు గగన తలమున నిలిపితివే! అనేకములైన శ్రేష్ఠమైన భావనలను
అమృతమట్లుగా పంచు టకు ఆనందాది రసస్ఫోరకముగా; పరవశము కలుగఁ జేయు
విధముగనాలో వెలయఁ జేయుదువు కదా! ఇదంతయు ఏవిధముగా చేయఁ గలుగు చుంటివి?
వర భావనల్ సుధలు పం - చ రసాదిగ చొక్కుఁ జేతు; సత్ఫలద హరీ! 88.
భావము:-
మంచి ఫలితములను ప్రసాదించు ఓ శ్రీహరీ! పరమాణువునుండి అనంతమైన గొప్పవైన
రసాతలాదిగా గల సుప్రసిద్ధమైన చతుర్దశ భువనములను; వాటిని కనీసము తలచుటకైనను చేతకానివాడిని నేను. శ్రేష్ఠమైన భావనలను అమృతమట్లుగా
పంచు టకు ఆనందాది రసస్ఫోరకముగా నా కవితలో ప్రవేశించు నట్లుగా
చేయు చుందువు నీవు.
సుధలు పంచ రసాదిగ చొక్కఁ జేతు! - వెలయ దక్షతఁ జేతువు; వేణు గోప! 88.
భావము:-
ఓ వేణుగోపుఁడా! నిన్ను నేను చూచి భక్తితో సేవించి పరవశించితిని. నీ యొక్క వైభవ రీతిని
నేను ఇష్టముతో తలచితిని. నిన్ను కొలుచుటకు చేరి కూడా కొలుచుట ఎఱుగను.
నీ కృపతో నన్ను విజయ ధామమునకుఁ జేర్చుము.
ఉ:- శ్రీ మతిఁ గొల్పితే! పరవశించితిఁ నిన్ గని భక్తిఁ గొల్చి; చిత్
శ్రీ మత మాత్రుకా విభవ రీతి తలంచితి; ప్రీతి తోడ నే.
శ్రీ మతి మాలి నిన్ కొలువఁ జేరి తదేకతఁ గొల్వ నేర. శ్రీ
ధామ! హరీ! కృపన్ విజయ ధామముఁ జేర్చర! వేణు గోపకా! 89.
భావము:-
ఓ వేణుగోపకుఁడా! నేను శ్రీమతిఁ గలుఁగఁ జేసితివి. నిన్ను చూచి పరవశించి
భక్తితో గొలిచితిని.మనస్సు నందు మంగళప్రదమైన త్రి మాత్రుకలకు సంబంధించిన వైభవ రీతిని నేను ప్రేమతో తలచితిని.మంగళప్రదమైన మనస్సు
నశించిన వాడినై నిన్ను కొలుచుటకు చేరి కూడా కొలుచుట ఎఱుగను.
లక్ష్మీ దేవికియిరవైనవాడా! ఓ శ్రీ హరీ! నీ కృపతో నన్ను విజయ ధామమునకుఁ
జేర్చుము.
మతి మాలి నిన్ కొలువఁ జే - రి తదేకతఁ గొల్వ నేర. శ్రీ ధామ! హరీ! 89.
భావము:-
లక్ష్మీ దేవికి ఇరవైనవాడా! ఓ శ్రీహరీ! నిన్ను నేను భక్తితో సేవించి; చూచి పరవశించితిని.
మనస్సు మంగళప్రదమైనదేనా? నాకసలు మనస్సనుదానిని కలుగఁ జేసితివా? మంగళప్రదమైన మనస్సు నశించిన వాడినై నిన్ను కొలుచుటకు చేరి కూడా
కొలుచుట ఎఱుగను.
గీ:- పరవశించితిఁ నిన్ గని భక్తిఁ గొల్చి; - విభవ రీతి తలంచితి ప్రీతి తోడ నే.
కొలువఁ జేరి తదేకతఁ గొల్వ నేర. - విజయ ధామముఁ జేర్చర! వేణు గోప్! 89.
భావము:-
ఓ వేణుగోపుఁడా! నిన్ను నేను చూచి భక్తితో సేవించి పరవశించితిని. నీ యొక్క
వైభవ రీతిని నేను ఇష్టముతోతలచితిని. నిన్ను కొలుచుటకు చేరి కూడా కొలుచుట
ఎఱుగను. నీ కృపతో నన్ను విజయ ధామమునకుఁ జేర్చుము.
చ:- నులి పలు మారులా పురిటి నొప్పులు దేవకి పొందఁ జేసి; భూ
స్థలిని కృపన్ సదా పుడమి చాలగ నిన్ గని పొంగఁ జేసి; లగ్న డబడబల్ గనన్ సుఖము నందులు; భక్త యశోద యందఁ దో
డ్పడిన హరీ! యిటుల్ వెలయ భావ్యమొ? చెప్పుమ! వేణు గోపకా! 90.
{డబడబల్ = ఔద్ధత్యములు.(దే)బడబల్ = బ్రాహ్మణ స్త్రీ.(సం)-లగ్నము = సిగ్గు పొందినది.(సం)}
భావము:-
ఓ వేణుగోపకుఁడా! నీవు పుట్టే టప్పుడు ఆ దేవకీ దేవికి ప్రేగులలో పురిటి నొప్పులను
అనేక పర్యాయములు పొందే విధముగ చేసితివి. కృపతో ఈ భూమిపై ఉండి; నిన్ను చూచి
భూదేవి పొంగేవిధముగ చేసితివి. నీ తగులుబాటు కారణముగా ఔద్ధత్యములు
పొందే విధముగా సుఖమును ఆ నంద యశోదలు అందుటకు నీవు తోడ్పడితివి. ఆ విధముగ నీవు చేసి వెలయుట తగునా? ఓ శ్రీ హరీ! చెప్పుము.
క:- పలు మారులా పురిటి నొ - ప్పులు దేవకి పొందఁ జేసి; భూస్థలిని కృపన్
బడబల్ గనన్; సుఖము నం - దులు; భక్త యశోద యందఁ దోడ్పడిన హరీ! 90.
భావము:-
ఓ శ్రీహరీ! నీవు పుట్టే టప్పుడు ఆ దేవకీ దేవికి పురిటి నొప్పులను అనేక పర్యాయములు
పొందేలాగ చేసితివి.కృపతో ఈ భూమిపై బ్రాహ్మణ స్త్రీలు పర్యవేక్షిస్తుండగా ఆ నంద యశోదలు
సుఖమును అందుటకు నీవు తోడ్పడితివి.
గీ:- పురిటి నొప్పులు దేవకి పొందఁ జేసి; - పుడమి చాలగ నిన్ గని పొంగఁ జేసి;
సుఖమునందులు;భక్త యశోద యంద;-వెలయ భావ్యమొ?చెప్పుమ!వేణుగోప! 90. భావము:-
ఓ వేణుగోపకుఁడా! నీవు పుట్టే టప్పుడు పురిటి నొప్పులను ఆ దేవకీ దేవి పొందేలాగ చేసితివి. నిన్ను చూచిభూదేవి పొంగేలాగ చేసితివి. సుఖమును ఆ నంద యశోదలు
అందునట్లుగా నీవు చేసి వెలయుట తగునా? చెప్పుము.
( సశేషం)
జైశ్రీరాం.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.