గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జులై 2010, ఆదివారం

వల్లభ వజ్ఝల వారి చ"తురంగ" గతి (చదరంగ) బంధ సర్వ లఘు కందము.

జైశ్రీరాం
ప్రియ సాహితీ బంధువులారా!
బ్రహ్మశ్రీ వల్లభవఝల ఆప్పల నరసింహముర్తి, జుత్తాడ.విశాఖపట్టణం జిల్లా.
 రచించిన చ"తురంగ" గతి బంధ సర్వ లఘు కందము మీ ముందుంచుతున్నాను. ఈ మహానుభావులు. నేను వ్రాస్తున్న చిత్ర , బంధ కవితల కాకర్షితులై తానూ స్వయంగా వ్రాసి నాకు పంపియున్నారు. నేను వ్రాసినవి ఆదర్శంగా తీసుకొని మిగిలినవారూ అలా వ్రాయ గలగాలని  నేనాశించినవిధంగా ఈ కవి ఈ విధంగా వ్రాయడం నాకెంతో ఆనందం కలిగించింది.
ఇప్పుడా పద్యం చూడండి.
చూచారు కదండి. ఎంతో శ్రద్ధతో; ఎంతో ఆసక్తితో బంధ కవిత్వాన్ని సహితం సాధన చేసి; అద్భుతమైన పద్యం వ్రాసారు. 
ప్రయత్నిస్తే మీరు మాత్రం వ్రాయలేరా యేమి? తప్పక ప్రయత్నించండి.
బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవిగారికి నా అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.
Print this post

3 comments:

కొత్త పాళీ చెప్పారు...

భలే ఉందండి. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బ్రమ్మ శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహ మూర్తి గారి " చతురంగ గతి సర్వ లఘు కందమును మాకందరికి అందించి నందుకు ధన్య వాదములు అందరిని వ్రాయమని ప్రోత్సహించి నందుకు అభినందనలు

రవి చెప్పారు...

చాలా అందంగా, సులభగ్రాహ్యంగా వ్రాశారు. పంచుకున్నందుకు ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.