పుంభావ సంగీత సాహిత్య సరస్వతీ మూర్తులు శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ; మా గురు దేవులు బ్రహ్మశ్రీ మానాప్రగడ శేషశాయి గారు ఆశీనులై యుండగా వెనుకనున్నది మన " అసంఖ్య " బ్లాగ్ మిత్రుఁడు చిరంజీవి సోమశేఖరుని పూజ్య మాతా పితలు; ఈ చిత్రంలో ఉన్నారు. శ్రీమాన్ శేషశాయి గారి ఇంటి వద్ద వీరంతా సమావేశమైన సందర్భంగా వారు ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పటి చిత్రము.
శ్రీ మానా ప్రగడ శేషశాయి గురు దేవుల కడ ( ౧౯౬౯ -౧౯౭౨ ) విద్య నభ్యసించిన శిష్య కోటిలో నేనూ ఒకడిని.
మా గురువు గారు రచించిన ప్రసన్న భాస్కరం అనే మకుటం లేని మహాశతకాన్ని " ఆంధ్రామృతం "లో మీరు చూడ వచ్చును.
ప్రస్తుతం మా గురువు దేవులు శ్రీమద్వాల్మీకి రామాయణాన్ని తనదైనశైలిలో పద్యకావ్యంగా వ్రాస్తున్న పనిలో నిమగ్నులై యున్న వార్త సాహితీ ప్రియులందరి ఆనందానికీ కారణమౌతోంది. ఆ పరమాత్మ మా గురుదేవులకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రసాదించి వారి వాంఛితార్థం నెరవేర్చాలని మనసారా కోరుకొంటున్నాను.
వారిశిష్యుడుగా చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంటుంది. వారి ఆశీర్వాదంతోనే మేము బ్రతికేస్తున్నాము. ఆ పుంభావ సరస్వతీ మూర్తి ద్వయమునకు బ్లాగ్ ముఖంగా నమస్సులు తెలియఁ జేసుకొంటున్నాను.

జై శ్రీరామ్.
జైహింద్.
Print this post
1 comments:
ప్రముఖుల్ని పరిచయం చేస్తున్నందుకు ధన్య వాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.