ప్రియ సాహితీ బంధువులారా!
మన ఆంధ్ర సాహిత్యము నిత్యము సాహితీ సౌరభాన్ని కప్పురము వలె దశ దిశలకు వ్యాపింపఁ జేయడానికి మూల కారణము అందుగల రచనా వైవిధ్యమే. ఎన్నెన్ని సొగసులు; ఎన్నెన్ని రకములు !
అన్నీ మన ఆంధ్రామృతానికే సొంతం. అది మనకెంతో ఆత్మానందాన్నిస్తుంది కూడాను.
ఇక ప్రస్తుతం బంధ కవిత్వంలో నక్షత్రబంధ కంద పద్యన్ని వ్రాసితిని. అది మీ ముందుంచుతున్నాను.
కll
సుమ హృదయజ ! రమణ! కృపా
నుమతిన్ దగు నద్భుత సుధను కురియ; సు శ్రే
య మయ మగును. జక్కన్ గను
మము. తగు విధముల గన; హితమగు. శ్రేష్టము నౌన్ !
భావము.
హృదయ పుష్పమునుండి ఉద్భవించినవాఁడా! ఓ వేంకట రమణా!నీ కృపానుమతితో అద్భుతమైన అమృతమును మాపై కురిసినచో అంతా మంచి శ్రేష్టమైనది యగును సుమా! మమ్ములను చక్కగా చూడుము. తగిన విధముగా నీవు చూచినచో మాకు చాలామంచి యగును. అది ఉత్తమమైనదియు నగును సుమా!
పటముపై క్లి చెయ్యండి
ఈ నక్షత్ర బంధములో ఒక ప్రత్యేకతను మనము దృష్టిలో పెట్టుకోవాలి. అదేమిటంటే
కోణాగ్రములందు వచ్చెడి ఐదు అక్షరములు ఒక చక్కని అర్థము గల పదమై యుండ వలెను. అట్లే
కూడలుల యందు కూడా వచ్చే ఐదక్షరములు ఒక చక్కని అర్థవంతమైన పదమై యుండ వలెను.
నేను రచించిన ఈ పై పద్యమునందు
కోణాగ్రమున వచ్చిన పదము " సుజనులకు "( సుజనులకు = మంచివారికి)
అట్లే
కూడలులయందు వచ్చిన పదము " శ్రేయమగుత."(శ్రేయమగుత = మంచి సమకూరును గాక)
చూచారు కదండీ!
ఎంచి చూచిన దోషంబు లెన్నియేని
యుండకుండునె? మీరలట్లున్నయెడల
ఎంచి చూపుఁడు. సరి చేతు.మంచి నెంచి;
యంచలట్టుల మీరు గ్రహించువారు.
నక్షత్రమునందు చూపుట కొఱకు ఆంగ్లమున వ్రాసితిని. ఆంధ్రమున వ్రాయుట చేతకాని వాఁడ నగుటచే క్షంతవ్యుఁడను.
శ్రమ తీసుకొని చదివిన స రస హృదయులైన మీకు నా ధన్యవాదములు.
జై శ్రీమన్నారాయణా.
జైహింద్.
10 comments:
మీ బంధ కవిత్వం అమోఘంగా ఉంది. మరుగున పడి పోతున్న ఒకానొక ప్రక్రియను పునరుద్ధరించి, విజయవంతంగా నిర్వహిప్తున్నందుకు మీకు నా అభినందనలు. ఎంతో సమర్ధత గల వారు తప్ప ఈ పని చేయ లేరు.
వీటితో పాటు రసవంతాలయిన మంచి ఖండ కావ్య రచనలు కూడ మీ కలం నుండి జాలువారాలని కోరుకుంటున్నాను.
ఆహా! తెలుగు భాష సౌందర్యం మీ బ్లాగులో గుభాళిస్తోందండి. ఎంత తరచినా తనివి తీరనంత అద్భుతంగా ఉంది.
ఈ నక్షత్ర బంధ కందము చాలా అందం గా ఉంది ఇంత చక్కని మెరుపు తెమ్మెరలు ఆహా ! మన తెలుగు భాషకె సొంతం అదీ చింతా వారి కలమ్నుంచి ఇంకా ఇంకా " సర్వతొ భద్ర బంధము " నాగ బంధము " చక్ర బంధము " సిమ్హాసన బంధము " ఇలా అన్నీ మలయ మారుత తరంగాలు గా మనసు మనసునీ స్పందింప జేయాలని కోరుతు ఆశీర్వ దించి అక్క
మిత్రమా! ధన్యోస్మి. కృతజ్ఞతాభివందనములు. నీ ఆకాంక్ష నాకు ఆదేశము. నారచనకు ప్రాణశక్తి. తప్పక మీకు సంతసము కలిగించ గలిగిన చక్కని రచన ఆ పరమాత్మ తప్పక నాచే చేయిస్తాడనే విశ్వాసానికి నీ ఆకాంక్ష ఊపిరి పోసింది.ధన్యవాదములు. ఈ రోజు ఇప్పుడే మన గురుదేవులకు వందనములర్పిస్తూ నక్షత్రబంధ కందం మన ఆంధ్రామృతంలో ఉంచాను.నీవు చూచి చక్కని సూచనలీయ వలసినదిగా కోరుచున్నాను.
చిరంజీవీ!రవీ! నీవిస్తున్న ప్రోత్సాహమే నాలో కవితోత్సాహాన్నిస్తోంది.నీ కళా పిపాసకు అభినందిస్తూ; నీవభినందించినందుకు నెనరులు తెలియజేసుకొంటున్నాను.
అక్కా! నమస్తే.
నీవు చేసిన సూచనలు ఆజ్ఞలుగా భావిస్తున్నాను. తప్పక మీరు ఆదేశించిన విధముగా మిగిలినవి కూడా వ్రాసే ప్రయత్నం చేయ గలనని మనవి చేయుచున్నాను.
అక్కా! నమస్తే.
నీవు చేసిన సూచనలు ఆజ్ఞలుగా భావిస్తున్నాను. తప్పక మీరు ఆదేశించిన విధముగా మిగిలినవి కూడా వ్రాసే ప్రయత్నం చేయ గలనని మనవి చేయుచున్నాను.
చాలా ఆసక్తికరంగా ఉంది సార్.
రాజేశ్వరక్కా! నమస్తే.
నీవు చేసిన సూచనలు ఆజ్ఞలుగా భావిస్తున్నాను. తప్పక మీరు ఆదేశించిన విధముగా మిగిలినవి కూడా వ్రాసే ప్రయత్నం చేయ గలనని మనవి చేయుచున్నాను.
స్వామిగారూ! ధన్యోస్మి.కృతజ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.