1)నర్కుటకము:- న - జ - భ - జ - జ - వ.
(1వ అక్షరంతో - 11వ అక్షరానికి యతి)
జనకజ భర్తనే సతము చక్కగ సమ్మతితో;
మనమున నిల్పుచున్ మనుజ మాన్యులు మన్ననలన్
గనుటది సత్యమే! కరుణఁ గాంచుచు; కామ్యదుఁడై
ప్రణుతులనందు యీ ప్రభువు రాముఁడె రమ్యుఁడుగా!
2)కోకిలకము:- న - జ - భ - జ - జ - వ.
(1వ అక్షరంతో - 8వ అక్షరానికి - 14వ అక్షరానికి యతి)
జనకజ భర్తనే సతము చక్కగ సమ్మతితో;
మనమున నిల్పుచున్ మనుజ మాన్యులు మన్ననలన్
గనుటది సత్యమే! కరుణఁ గాంచుచు; కామ్యదుడై
ప్రణుతులనందు యీ ప్రభువు రాముడె రమ్యుఁడుగా!
3)చంపకము:- న - జ - భ - జ - జ - జ - ర.
(1వ అక్షరంతో - 11వ అక్షరానికి యతి)
జనకజ భర్తనే సతము చక్కగ సమ్మతితో; ముదాత్ములై
మనమున నిల్పుచున్ మనుజ మాన్యులు మన్ననలన్ సతంబు తా
గనుటది సత్యమే! కరుణఁ గాంచుచు; కామ్యదుఁడై మనంబులన్
ప్రణుతులనందు యీ ప్రభువు రాముఁడె రమ్యుఁడుగా! ధరాస్థలిన్.
ప్రాస నియమమన్నింటికీ ఉంటుంది.
జైహింద్.
3 comments:
చాలా బాగుందండి.
చంపకము అందరికీ తెలిసినదే అయినా, దానికి సామీప్యం వున్న ఆ రెండు వృత్తాలనూ పరిచయం చేసినందులకు ధన్యుడను।
బాగుంది " బంధ కవిత్వము " ఛందస్సు చక్కగా నేర్పు తున్నందుకు అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.