గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జూన్ 2010, గురువారం

శారదా కటాక్ష సిద్ధిరస్తు.

అహరహమున్ శ్రమించి మన యాంధ్ర  మహా మృత పాన లోలురన్
సహన వివేక వర్తులుగ చక్కగ మార్చగ శారదాంబ తా
బహుముఖ బోధనల్ సలుప సన్నుత సాహితి నంద జేసె. స 
ద్గ్రహణ వివేక వర్తుల ధరాతల మందు నుతింప జేసెడిన్.
సదయులు సన్నుతాత్ములును; సత్య వివేక ప్రపూర్ణ  శోభితుల్ ; 
మధుర వచో విలాసులు సమస్త శుభప్రద    కార్య ధుర్యులున్.    
చదువరు లైన మీకు మన శారద మాత మనోజ్ఞ భాషణా
విధము నొసంగి బ్రోచు! సవిధంబగు  జీవన భాగ్య మిచ్చుచున్. 
జైహింద్. Print this post

3 comments:

మనోహర్ చెనికల చెప్పారు...

చాలా బాగా చెప్పారు.
నాకు మీ సలహాలు కావాలి.
http://newjings.blogspot.com/2010/06/blog-post_24.html

ఇకనుండి సీరియస్ గా చంధస్సు నేర్చుకుందామనుకుంటున్నాను. మీసలహాలు ఆశీస్సులు కావాలి.

రవి చెప్పారు...

అద్భుతమైన పద్యాలు, అందమైన బొమ్మ.

Sanath Sripathi చెప్పారు...

ధన్యోస్మి .. గురువుగారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.