గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2010, సోమవారం

చ"తురంగ" గతి (చదరంగ) బంధ సర్వ లఘు కందము

సుహృన్మణులారా! ఈ క్రింది సర్వ లఘు కందము చతురంగ బంధము కలిగి యున్నది.
ఇందు " నినుకని - జగతిని - మరతును - వరదుఁడ " అనే పదాలు భావ యుక్తంగా అశ్వ గతిలో వస్తాయి. పరిశీలించండి. మీ నుండి మేల్గొల్పు మంచి సూచనలకై ఎదురు చూస్తున్నాను.  ఇక చూడండి.
మదులను గలడని; విని; ఘన   
పదు డమర నుతుఁడు; ధర ప్రతిభఁ గని; కొలువగన్;
బుధ జన వినుతులు వినగ సు
మధుర మదిని తిరముగ మను. మరువక నిలుచున్.
భావము:-
గొప్ప పాదములు కల వాఁడును; దేవతల చేత కీర్తింపఁ బడు వాఁడును అగు శ్రీమన్నారాయణుఁడుమన భివిపై మనస్సులలో కలఁడని విని; అతనిని ప్రతిభ కలిగి చూచి; కొలిచినట్లైతే బుధ జనులు చేయు పొగడ్తలు వినుట కొఱకు సుమధుర మైన మనస్సులలో  స్థిరముగ ఉండును. ఏమరుపాటు అనునది లేక నిలుచును.
మ   దు      ల     ను     గ     ల      డ       ని;
వి     ని;     ఘ    న      ప     దు          మ
ర     ను     తుఁ   డు     ధ     ర      ప్ర       తి
భఁ          ని ;     కొ     లు    వ     గ        న్
బు   ధ            న     వి     ను   తు     లు  
వి     న      గ     సు     మ     ధు         మ  
ది     ని      తి      ర     ము     గ         ను.  
మ   రు      వ      క      ని     లు    చు      న్.
చూచారుకదా! మీరూ యత్నించి మీ వినూత్న ప్రయోగాలను నేను కూడా చూచే భాగ్యం నాకు కలిగించండి.
జైహింద్. Print this post

4 comments:

Unknown చెప్పారు...

బాగుందండి. ఓ సారి క్రింది లింకును చూడగలరు వీలువెంబడి.
http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF%28%20%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%83%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%20%29

rākeśvara చెప్పారు...

అయ్య బాబోయ్ । ఛందస్సులో సమస్యలకు అంతే లేదన్న మట।
మీ బోటి వారు ఇలాంటి వాటి మీదనో పుస్తకం వ్రాస్తే,
కనీసం ఈ పుస్తకమయినా, భావి తరాలకు ఉపయోగపడుతుంది।

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సర్వ లఘు కందము " బంధ కవిత్వము " అన్నీ చాలా బాగున్నాయి మరి " సర్వ లఘు సీసము ,సర్వ లఘు కందము " ఇలా ఉన్నట్టుగానే " సర్వ గురు సీసము.సర్వ గురు కందము " మొత్తం " గురువులతొ " ఉండవా ? నాకు తెలియకే అడిగాను పొరబాటైతె ఏముంది ? [ మన్నించాలి ] అదన్న మాట మేటరు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కా! నమస్తే.
సర్వలఘు కందం; సర్వ లఘు సీసం ఉండవచ్చు. సర్వ గురు కందం నియమ బద్ధంగా వ్రాయ వచ్చు. కాని సర్వ గురు సీసం ఉండదక్కా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.