గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జూన్ 2010, సోమవారం

చెప్పుకోండి చూద్దాం?

రాయల వారి ఆస్థానమునకు ఉద్దండ పండితుడైన ప్రెగడరాజు నరస కవి వచ్చి తానెంత వేగముగ, కఠినతరముగ ఆశువుగా చెప్పెడిపద్యమైనను నిస్సంకోచముగ వ్రాయ గలనని ప్రతాపముగా పలుకుటవిని తెనాలిరామలింగఁడు ఒక అద్భుతమైన చాటుపద్యమును ఆతడు వ్రాయలేని విధముగా చెప్పాడు. 
ఆ పద్యమేమిటో మీరు చెప్పుకోండి చూద్దాం???
అదే నరస కవి  ఇతరుల కవిత్వంలో తప్పులు ఎంచెదననినందులకు కోపంతో,
చll
ఒకని కవిత్వమందెనయునొప్పులు తప్పులు నా కవిత్వమం
దొకనికి తప్పు బట్ట పని యుండదు. కాదని తప్పు బట్టినన్
మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో
సికమొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !
అంటూ ఊరుకోక ఇంకా ఇలాగన్నాడు.
చll
తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్
పలుకగ కాదు రోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ
పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా
రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !
చూచారు కదండీ మన రామలింగడి కోపాన్ని. సరేకాని పైన చెప్పుకోండి చూద్దాం అని ఒక ప్రశ్నవేసాను కదా! మీ నుండి వచ్చే సమాధానం  కోసం నే నెదుచూడనా?
జైహింద్. Print this post

4 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తెనాలి రామలింగడు తికమక పెట్టిన పద్యము.
1 తౄవ్వ....ట బా బాబా తలపై
బౄ......వ్వట జాబిల్లి వల్వ బూదట చేదే
బువ్వట...చూడగ...హుళుళులు
కవ్వట...నరయంగ...నట్టి...హరునకు జే..జే .!
అంతే కాదు " ఏ పద్యానికైనా అర్ధం చెప్పెద నన్న కవితొ
" మేకతోక ,మేకకొకతోక ,మెక మేకతోక " అని చెప్పి తిక మకబెట్టీ " ఇతరుల కవిత్వము నందు తప్పులు ఎంచెద నని చెప్పినందులకు " " చింతా వారు చెప్పిన " " ఒకని కవిత్వ మందెనయు " పద్యములు రామలింగ కవి చెప్పెను

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తెనాలి రామలింగడు తికమక పెట్టిన పద్యము.
1 తౄవ్వ....ట బా బా తలపై
బౄ......వ్వట జాబిల్లి వల్వ బూదట చేదే
బువ్వట...చూడగ...హుళుళులు
క్కవ్వట ...నరయంగ...నట్టి...హరునకు జే..జే .!
అంతే కాదు " ఏ పద్యానికైనా అర్ధం చెప్పెద నన్న కవితొ
" మేకతోక ,మేకకొకతోక ,మెక మేకతోక " అని చెప్పి తిక మకబెట్టీ " ఇతరుల కవిత్వము నందు తప్పులు ఎంచెద నని చెప్పినందులకు " " చింతా వారు చెప్పిన " " ఒకని కవిత్వ మందెనయు " పద్యములు రామలింగ కవి చెప్పెను

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

amdulo akshara dOshAlu unnayi tammuDu amdukani maLLee pampanu

రవి చెప్పారు...

బావుంది మీ ప్రశ్న.:-) అయితే తెనాలి రాముడికి ముందు ముక్కు తిమ్మన ఆ ప్రగడ నరసరాజు గారికి ఓ సమాస, శ్రవ్యాలంకారభరితమైన శ్లోకం ఒకటి చెబుతాడు. ఆ పరీక్షలో నరసకవి నెగ్గుతాడు.

ఆ శ్లోకం కోసం నేను వెతుకుతున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.