కె.ఆర్. విజయ నా?
జయ అన్నారు
ప్రశ్నకి సమాధానం S.R.Rao గారు మాత్రమే చెప్పగలరు.
vempati china satyam gaaru
స్థానం వారేమో అనుకున్నాను, కాదన్న మాట.
చూద్దాం ఎవరన్నా చెబుతారేమో
భవదీయుడు
ఊకదంపుడు
కోడీహళ్ళి మురళీ మోహన్ అన్నారు...
జి.వరలక్ష్మి?
కోడీహళ్ళి మురళీ మోహన్ అన్నారు...
ఎస్.వరలక్ష్మి?
vedaantam ( motham peru gurtuledu)?
varalakshmi
చిలమకూరు విజయమోహన్ అన్నారు...
కాంతారావుగారా?
vedantam satyanarayana
Sthanam Narasimha Rao garu!
పాఠకావతంసులారా! మీరంతా ఎంతో ఉత్సాహంగా పైన చిత్రంలో ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారో ఊహించి చెప్పినందుకు ధన్యవాదములు. ఇంటికి స్త్రీ వేషంలో వచ్చిన తనను "కట్టుకొన్న భార్యే" గుర్తించలేక ఎక్కడి నుంచో తనయింటికి వచ్చిన ఒక ముత్తైదువగా భావించి, పసుపు వ్రాసి, బొట్టు పెట్టి, వస్త్రము, ఫలాలు ఇచ్చి, సాగనంపింది. తానూ ఏమీ మాటాడకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయి, వేషం మార్చుకొని భార్య యిచ్చిన చీర మొదలైన సామగ్రితో పసుపు పాదాలతో ఇంటికివచ్చిన తనను చూచి, ఇందాకా ఒక ముత్తైదువకు ఇచ్చిన ఈ వస్తువులన్నీ మీదగ్గరున్నాయేమిటి? కొంపతీసి మనవస్తువులుగా గుర్తించి లాక్కొచ్చేసారా యేమిటి? అని అతనిని ప్రశ్నించేసరికి,
ఓసి వెఱ్ఱిదానా! ఇందాకా మనింటికొచ్చిన ముత్తైదువను నేనేనే!! అనే సరికి ఆ యిల్లాలు స్త్రీ వేషంలో ఉన్న తన భర్త తానే గుర్తించ లేనంతగా, నిండు ముత్తైదువలాగ, ఎంతో ముచ్చటగా ఉండ దాన్ని చూచి, ఆశ్చర్యపోయి,తెల్లఁ బోయి, నవ్వుతూ, సిగ్గుతో తన భర్త దగ్గర తల వంచుకొంది. ఇంతకీ అతఁ డెవరంటారు?
ఎవరో యేంటండీ!
మీలో పద్మగారూ, సీ.బీ. రావు గారు. చెప్పారు కదండీ! అలాగే సత్యంగారు చెప్పిన రెండింటిలో మొదటిది ,
అవి సరైన సమాధానాలే కదండీ!
అదేనండి కూచిపూడి కళా కారులైన , సత్య భామ పాత్రాబినయించడంలో తనకు తానే సాటి అనిపించుకొన్న
శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారే వారు.
స్త్రీపాత్రలో మగువలకు కూడా మత్తెక్కించే ఆహార్యంలో కూచిపూడి కళా కారుడిగా అందరి మనసులూ దోచుకున్న మన తెలుగువాఁడు శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ.
ఆll
కూచి పూడి నృత్య కువలయేక్షణ సత్య
భామ వేషమందు ప్రథితుఁడితఁడు.
విశ్వ కీర్తిఁ గన్న వేదాంత సత్యనా
రాయణాఖ్యుఁడితఁడు రమ్య మూర్తి.
ఇంత చక్కగా చెప్పిన మీ అందరికీ అభినందనలు.!
జైహింద్.