గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 88.

ప్రియ పాఠక మహాశయులారా!
సత్సాంగత్యము ప్రభావ వంతమైనది. మనమెన్ని మారులు చెప్పుకొన్నను మళ్ళీ మళ్ళీ చెప్పాలనే ఉంటుంది. అందుకు తగినట్టు క్రొత్తవిషయాలు లభిస్తూనే ఉంటాయి.
పండిత రాయ శతకంలో చూచిన ఒక చక్కని శ్లోకాన్ని మీ ముందుంచుతున్నాను.
శ్లోll
మహానుభావ సంసర్గః కస్యనోన్నతికారణం. 
ప్రవిశ్య గంగాం రథ్యాంబు త్రిదశైరపి సేవ్యతే.(పండిత రాయ శతకం)
ఆll
గొప్పవారి జేరు కొలది వారును కూడ
గౌరవంబు పొందు ఘనతరముగ.
గంగలోన చేరు కలుష జలము కూడ
దేవ గణము చేత సేవితమగు
భావము:-
మహానుభావుల సంసర్గము అల్పులకును ఔన్నత్యము కల్పిస్తుంది. గంగలో కలిసిన వీధి నీటికి కూడా దేవతలచే సేవింపఁబడు యోగ్యత కలగడం చూడట లేదా?
అందుకే మంచివారు అనిపిస్తే మాత్రం వారికి విసుపు కలుగుతున్నా మనం విడువ కూడదు కదా!
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.