"సుమధురం" అనే చలన చిత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో నిర్మిస్తున్న సందర్భంగా
కళా తపస్వి శ్రీ విశ్వనాథ దంపతులు అక్కడ మకాం చేసి; గడచిననాలుగు రోజులూ కవివతంస
శ్రీ బులుసు వేంకటేశ్వర్లును కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్ప వృక్షముపై ఉపన్యసించమని కోరి, వారు దీక్షగా విన్నారు. ఆ సందర్భంలో తీసిన చిత్రాలను ప్రదర్శిస్తున్నాను.
కళా తపస్వి శ్రీ విశ్వనాథ దంపతులు కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు చే కవిసమ్రాట్ విశ్వనాథ రామాయణ కల్ప వృక్షం పై ఉపన్యసింపఁ జేసి ఆలకిస్తున్న దృశ్యం.
కవివతంసకు కళా తపస్వివిశ్వనాథ దంపతులు నూతన వస్త్రాలు బహూకరిస్తున్న దృశ్యం.
కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లుతో, కళా రపస్వి శ్రీ విశ్వనాథ దంపతులు.
కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు మనకు చిర పరిచితులు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్ప వృక్షం పై అనర్గళంగా ఇచ్చిన ఉపన్యాసాల్లోంచి మనం ముఖ్యమైన వాటిని ఆంధ్రామృతంలో వరుసగా సుమారు 31 భాగాలింత వరకూ తెలుసుకొన్నాం.
అతని కీర్తి చంద్రికలు తాకి; కళా తపస్వి విశ్వనాథకు కవివతంస నోట విశ్వనాథ రామాయణం స్వయంగా వినాలనే కోరికతో అతనిని పిలిపించుకొని అన్నవరం దైవ సన్నిధిలో ఆ కోరికను ఇన్నాళ్ళకు తీర్చుకొని, పులకించిపోయారు. అట్టి మహనీయుని ఉపన్యాస భాగాలను మిగిలిన వాటిని కూడా త్వరలో వరుసగా ప్రకటించడం జరుగుతుందని మనవి చేయు చున్నాను.
జైహింద్.
1 comments:
ఓ సారిటు చూడగలరు.
http://kasstuuritilakam.blogspot.com/2010/02/blog-post_21.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.