శ్లోll
ఏకో z భూన్నలినా త్పరస్తు పులినా ద్వల్మీకత శ్చాపరః
తే సర్వే కవయస్త్రిలోక గురవ స్తేభ్యో నమస్కుర్మహేll ( ఉద్భటుఁడు )
భావముll
కమలమునను, పులినమునను, వల్మీకమునను, పుట్టినవారే అపూర్వ కవులు.
పరమాత్మ కళయై, యమృత రూపిణి యైన వాణిని చిర తపః ఫలముగా దర్శించి, ఆమె దివ్య స్వరూపమును లోకమున కెఱిగించిన వారు వారే. కావున వాణి కంటెను ఆ కవులే వందనీయులు. ఆ సరస్వతి లోకమున ప్రకాశింప తనంత తానే బ్రహ్మ నలు మొగముల నుండి నాలుగు రూపములతో వెలువడినది. ఆ కారణముగా బ్రహ్మ ప్రథమ కవి యైనాడు. అష్టాదశ పురాణములను, భారతమును మిత్ర సమ్మితములుగా వెలువరించిన వ్యాసుడును, రామాయణమును కాంతాసమ్మితముగా వెలువరించిన వాల్మీకియు పూజ్యులైనారు. ఈ మువ్వురి కారణముగ ప్రసిద్ధమై, లోకమును కాపాడే వేద సరస్వతీ మాత జ్ఞానదేవత. ఆమెకు నమస్కరించుటకు పూర్వము మూలమైనవారగు బ్రహ్మ,వ్యాస, వాల్మీకి లు పూజనీయులు.అట్టి వారికి నమస్కారము.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.