ఆంధ్రామృత పాన లోలులారా! ఆంధ్ర భాషాభిమానులారా!
హితం మనోహారిచ దుర్లభం వచ: అని విన్నాం కదా! ఇప్పుడు మరొక చక్కని శ్లోకంలో మనలను మేలుకొలుపుతున్నాడీ కవి. చూద్దాం.
శ్లోll
లభ్యతే ఖలు పాపీయాన్ నరో సుప్రియ వాగిహ
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభఃll
గీll
తీపి మాటలు చెప్పుచు పాపులిలను
మోసగింతురు. కనుఁ డది మోస మనుచు.
కఠిన సత్యము పలుకఁగ, కరుణ వినగ;
కలుగు వారలు తక్కువ కలరు భువిని.
భావము:-
తీయని మాటలచే మోసపుచ్చు పాపులు ఈ లోకంలో సర్వత్రా ఉన్నారు. కాని కటువైనను పథ్యముగా ఉండే మాటలు చెప్పు వారు, విను వారు కూడా లోకంలో అరుదుగానే ఉంటారు కదా!
తీపిగా మాటాడే మోసగాళ్ళున్నారని గ్రహించుదాం. వారి మాటల మత్తులో పడితే మోసపోవడం ఖాయం.
మన క్షేమమును కోరుచు యదార్థమును చెప్పెడి వారి మాటలు కఠినతరమైనను అప్రియమైన వైనను ఓర్పుతో విని; నిజాన్ని గుర్తించి అనుసరించడం మనకు శ్రేయస్కరం.
జైహింద్.
Print this post
సౌందర్య లహరి 91-95పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావు గారు, సంగీతం, గానం
శ్రీమతి వల్లూరి సరస్వతి.
-
జైశ్రీరామ్.
91 వ శ్లోకము.
పదన్యాసక్రీడా పరిచయమివారబ్ధుమనసః
స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి |
అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణిత
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చా...
4 నిమిషాల క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.