గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 87.

అజ్ఞానులు - జ్ఞానులు - - - ఇత్తడి - పుత్తడి.

శ్లోll
నిస్సారస్య పదార్థస్య ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ద్వనిస్తాదృక్ యాదృక్ కాస్యే ప్రజాయతే.
ఆll
సార హీనమైన సకల వస్తువులకు
డంబమెక్కువయ్య! డంబు తోచు. 
కంచుమ్రోగునట్లు  కనకంబు మ్రోగదు.
చూడ ముచ్చటగును సుజన పథము.
భావము:-
అల్ప వస్తువులకు ఆడంబరము ఎక్కువగా ఉంటుంది. కంచు మ్రోగునట్లు కనకము మ్రోగదు కదా!
మన పూర్వీకులు అపార లోకానుభవం రంగరించి చెప్పిన శ్లోకాలు మనకు లభించిన మేలిమి బంగారాలు.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.