సుహృజ్జనులారా!
ఈ క్రిందిది ఏ పద్యమో - ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.
సువినయంబొప్పఁ గ జూచువారలకు సద్ విజ్ఞానిగా దోచుచున్ రహించు
సుగుణ సంపన్నుగ శోభిలున్ పరమత క్రోధంబు లేదేలకో? యనంగ.
సుమనసుంబెద్దయెసుమ్మ! యంచు బొగడన్ మర్యాదయే రూపమౌననంగ
సుజనులే మెచ్చగ చోద్యమొప్ప మెలగున్. చైదంబులం దౌష్ట్యముల్ దలిర్ప.
సురుచిర సుహాసనంబుల ధరణి పయిన
తానె గొప్ప ధన్యాత్ముడుగానిరతము.
మెలుపున దురితము లరసి మెలగు కరటి
నరయ నగునే? భువి {పై} పయి ని భరము కాదె?
జైహింద్.
Print this post
శ్రీ లలితోపాఖ్యానము.
-
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
"హయగ్రీవా! కలియుగంలో భక్తులకు సర్వసుఖాలూ, మోక్షం ఇవ్వటానికి భండాసురుని
వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అ...
2 రోజుల క్రితం
1 comments:
మత్తేభ-గర్భ-సీసము, కంద-గర్భ-తేటగీతి (ఎత్తుగీతి). అంతేనాండీ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.