ప్రియ సాహితీ బంధువులారా! మనం ఈ సమయంలో ఒక చక్కని సమస్యా పూరణ చేస్తే చక్కగా వుంటుంది కదూ! ఐతే సమస్యేంటో ముందుగా చూడండి.
మాతృ హంతకుఁ డిలలోన మహిత మూర్తి.
చూచారు కదా! ఇక ఆలస్యం దేనికి? పూరణ కు ఉపక్రమించండి.
సరస్వతే అనుగ్రహ ప్రాప్తిరస్తు.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
7 comments:
కామముచే క్రోధము,క్రోధముచే
మోహము,మోహముచే ధృతినష్టము,
తద్వారా నాశనము,కావున కామమే మాత,అట్టి
మాతృ హంతకుడిలలోన మహిత మూర్తి.
ప్రియమైన సురేష్ బాబూ! ఎంతచక్కని భావన! ఐతే ఛందాన్ని కూడా జోడించగలిగితే బలే బాగుండేది.
ఇక్కడ ఛందంలో మీ భవనని నేను చూపుతున్నాను. గమనించండి.
గీ:-
కామ మనుతల్లి నేబిడ్డ కరుణ వీడి
చంపగలుగునొ యతనికి శాశ్వితముగ
తొలగు క్రోధాదులాపైన వెలయునిలను.
మాతృ హంతకుడిలలోన మహిత మూర్తి.
మీ శ్రద్ధకు అభినందనలు.
ఆశీశ్శులతో
చింతా రామ కృష్ణా రావు.
తండ్రి శాసనము నెఱుప తల్లిని హత
మార్చి, తండ్రి వరము జేత, మాతృ మూర్తి
ప్రాణమిచ్చి, రాముడెలమి రాణకెక్కె.
మాతృ హంతకుడిలలోన మహిత మూర్తి.
(పరశు రాముడు తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేఱకు, తల్లి రేణుకా దేవిని చంపి, తండ్రి వరం కోరుకొమ్మంటే, తల్లి ప్రాణాలను తిరిగి ఇవ్వమని వేడుకుని, తల్లిని తిరిగి బ్రతికించాడు(ట)).
తండ్రి యానతి యైనట్టి తత్ క్షణంబె
తల్లి రేణుకా దేవికి తలను నరికె
పరశు రాముడు - పితృ వాక్య పాలకుండు!
మాతృ హంతకు డిలలోన మహిత మూర్తి!
- డా.ఆచార్య ఫణీంద్ర
రామకృష్ణారావు గారు! సురేశ్ బాబు భావాన్ని ఈ క్రింది విధంగా అయితే యథాతథంగా, స్పష్టంగా చెప్పినట్టవుతుంది కదా! గమనించండి -
కామమున గల్గు క్రోధమ్ము , కలుగు దాని
వలన మోహమ్ము , మోహమ్ము వలన ధృతి వి
నాశమును , నాశమగు! ’కామ’ నామ దుష్ట
మాతృ హంతకు డిలలోన మహిత మూర్తి!
- డా.ఆచార్య ఫణీంద్ర
గాధిజుని యాగరక్షణకై వెడలిన
దాశరథి మార్గమందున తారసిల్లి
నట్టి తాటకం దునుమాడె నట! సుబాహు
మాతృహంతకు డిలలోన మహితమూర్తి.
gI:-
కంది శంకర! విఖ్యాత కథను తెలిపి
సుందరంబగు పూరణ సులభ గతిని
చేసి చూపిరి . మీకున్న వాసి తెలిసె.
శుభముఁ గొలుపుత మీకు నా యభవుడెపుడు.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.