ఈ 08 - 03 - 2009 వ తేదీన అంతర్ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి మా బ్లాగు తరపున, మా అభిమాన పాఠకుల తరపున శుభాకాంక్షలు.
చ:-
మహి మహనీయ మూర్తిగను, మాతగ, జీవన భాగ్య దాతగా,
నహరహమున్ శ్రమించు వినయాన్విత సోదరిగా, కుమార్తెగా,
సహనము తోడ మెల్గుచును సన్నుతిగాంచిన స్త్రీని సత్ కృపన్
మహిమనుఁ జూపి గాచుత! రమా రమణుండు భృశంబు నెల్లెడన్.
శ్లో:-
యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.
మహిళా లోకానికి నిత్యం శుభాన్నే ఆకాంక్షిస్తూ వారికి దైవానుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాను.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
1 comments:
బాగా వ్రాసారు. మీరు పద్య శిక్షణలో భాగంగా ఇచ్చిన ఆట వెలదిని నేర్చుకొని కొన్ని ఆట వెలదుల్ని 'కోట్లు కూడబెడుతు; కుర్చి నెక్కి' అనే మకుటంతో నా నరసింహ బ్లాగులో ప్రారంభించాను ఈ రోజే. దయతో చూసి తప్పులుంటే తెలియ జేయ గలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.