గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఫిబ్రవరి 2009, సోమవారం

మనం కూడా సమస్యా పూరణ చేద్దామా? 4

tensionఆర్యులారా!నమస్తే
మనమింతవరకు ఆటవెలది తేట గీతి కందము పద్యాలనే వ్రాసాము.
ఇప్పుడు మనం వృత్త పద్యాలు వ్రాసే ప్రయత్నం చేద్దామా?
ఐతే యీ క్రింది సమస్యా పురాణ చేసి చూద్దాం.

- - - - - - -> శ్రీ రఘు రాము డొక్కరుడె చేకొనె స్త్రీలననేక మందినే <- - - - -- - -

చూచారు కదా సమస్యా పూరణ కీయబడిన ఉత్పలమాల పద్య పాదం.
ఐతే ఇక ఆలస్యం చేయక పూరిద్దామా?
జైహింద్.
babai Print this post

9 comments:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

ఉత్పల మాల:
తారక రామ భూవరుడు ధర్మము తప్పక నిల్చినంతటన్
చేరెను కీర్తి కాంత మరి చేరెను క్రమ్మఱ రాజ్యకాంతయున్
చేరెను గెల్పు చేడియను చేరెను జానకి ప్రేమ మీరగన్
శ్రీ రఘు రాము డొక్కరుడె చేకొనె స్త్రీలననేక మందినే!!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జిగురు కులాబ్ధి సోముడగు శ్రీకర సద్గుణ సత్యనార్యుడే
సొగసుగ పద్య పూరణము సొంపుగ జేసె. ప్రబంధ రాజియై
జిగిబిగి గల్గి పండితులు తృప్తిగ మెచ్చగ నద్భుతంబుగా.
సుగుణ విరాజ భాసురుగ సోభిల జేయుతదైవ మీతనిన్.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

పేరుకు నాదుస్నేహితుడు పెట్టుకొనెన్"రఘురాము"డంచుగా
నీ, రచనాదురంధరు డనేక మహా బిరుదాల ప్రౌఢిమన్
ధారణ జేసినట్టి కవి ధారను వోయగ కావ్య కన్యలన్ -
శ్రీ రఘురాము డొక్కరుడె చేకొనె స్త్రీల ననేక మందినిన్!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శా:-
ఆచార్యా ! ఫణి రాజ ! మీ సఖుడు తా నత్యద్భుతంబౌనటుల్
ప్రాచుర్యంబగు కావ్య రాజములనే భాషన్ విలేఖించెనో?
నే చూడన్ ఫణి నామ ధేయుడొకడే ప్రఖ్యాతుడౌ నన్నిటన్.
ప్రాచుర్యంబుగ కావ్య కన్యలతనిన్ ప్రార్థింప చేపట్టనౌన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శా:-
ఆచార్యా ! ఫణి రాజ ! మీ సఖుడు తా నత్యద్భుతంబౌనటుల్
ప్రాచుర్యంబగు కావ్య రాజములనే భాషన్ విలేఖించెనో?
నే చూడన్ ఫణి నామ ధేయుడొకడే నిష్ణాతుడౌ నన్నిటన్.
ప్రాచుర్యంబుగ కావ్య కన్యలతనిన్ ప్రార్థింప చేపట్టనౌన్.

February 19, 2009 7:51 AM
తొలగించు

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మారుతి యేగె ద్వారకకు మాధవు జూడగ ద్వాపరంబునన్
శ్రీ రఘు రామభక్తు నయనంబుల కాతడు రాముడే అయెన్
ధారణ జేయ గోపికలు ధాత్రిజ బోలు యనేక కాంతలై
శ్రీ రఘు రాము డొక్కరుడె చేకొనె స్త్రీలననేక మందినే!!

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

చిన్న మార్పు:
మారుతి యేగె ద్వారకకు మాధవు జూడగ ద్వాపరంబునన్
ఆ రఘు రామభక్తు నయనంబుల కాతడు రాముడే అయెన్
ధారణ జేయ గోపికలు ధాత్రిజ బోలు యనేక కాంతలై
శ్రీ రఘు రాము డొక్కరుడె చేకొనె స్త్రీలననేక మందినే!!

ఆత్రేయ కొండూరు చెప్పారు...

guruvu gaaruu, aDagaTam asamanjasamEmO ainaa adigi cuustaanu.

miiriccE samasyalanu kanda paadamgaa kuuDaa maarci istE naalaanti vaariki avakaaSamu icci nattu untundi.

dhanyavaadaalu

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆత్రేయా!
క:-
కందముతో పాటుగ మీ
రందముగా చంపకోత్పలాదులు కూడా
బంధము చేయగఁ గోరుచు
నిందే నుంచితిని దీని, నెఱుగవె నీవున్?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.