జన్మకో శివరాత్రంటారు.
అరుదైన ఆ శివరాత్రి పర్వ దినం రానే వచ్చింది.
పరమ శివ రాత్రి సందర్భంగా భక్తి తత్పరులందరికీ అభినందనలు.
క:-
శివ మన శుభమగు. మనమున
శివుని కలిగి నడచు మనము శివ భరితులమే.
సువిలసిత జగము పరమ
శివుని కలిత మనగ దగును.శివ శివ యనుడీ.
తే.గీ:-
శివుని తన మది కనుగొని భవుని మహిమ
తెలియు మహితుని తెలివియె తెలివి యగును.
తెలియ దగు శివ మహిమను తెలియ కునికి
శివము విడిచిన కలుషిత శవము మనము.
తే.గీ:-
ధనము శివుడు. మనము శివుడనగఁ దగును.
ప్రణవము శివుడు. జగమన పరమశివుడు.
సుగుణము శివుడు.సకలము లగు ను శివుడు.
శివ మహిమ మెఱిగి మనము శివుని గనుత.
క:-
నిన్నే నిత్యం బర్ధిన్
గన్నన్ ముక్తే లభించు గాదే దేవా!
నన్నున్ నీవే తోడై
కన్నప్పన్ గన్నదేవ! కావన్ రావా.
తే.గీ:-
భక్త కోటిని ప్రార్థింతు. పరమ శివుని
ముక్తి దాతను మరువక, శక్తి కొలది
భక్తి తోడుత చేయుడు భజన నేడు.
శక్తి కలిగించు పరమ శివ శక్తులీకు.
ఆ పరమ శివుని కరుణా కటాక్షం మనందరికీ లభించును గాక.
జైహింద్.
Print this post
కి.శే. బ్రహ్మశ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రిగారి సంగ్రహ జీవిత చరిత్ర . సేకరణ
శ్రీవల్లభ.
-
జైశ్రీరామ్.
*కి.శే. బ్రహ్మశ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రిగారు* *జీవిత
చరిత్ర*
శ్రీయుతులు,వాసా వేంకట రామయ్య,వేంకమాంబ దంపతుల...
1 వారం క్రితం
వ్రాసినది












1 comments:
మహా శివరాత్రి శుభాకాంక్షలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.