ఆంధ్రామృతాస్వాదనా లోలులారా ! మీ కవితామృతాన్నందించండి.
పూరించ వలసిన సమస్య:-
>నిప్పుకు చెద బట్టెనయ్య. నేర్పరి యింటన్.< ఇది కంద పద్యం రెండవ{లేదా}నాల్గవ పాదం గా రావాలి.
విషయమంటారా! మీ రేఅంశాన్ని బాగా వ్రాయగలరో అదే వ్రాయ వచ్చు.
ఆత్రేయగారిలా పూరించారు.
కం:
అప్పుగ తెచ్చిన డబ్బుతొ
గొప్పగ వడ్డిని గెలిచిన గోమటి తెలివీ
చెప్పులు కొరకగ కుంటిన
నిప్పుకు చెదబట్టెనయ్య నేర్పరి యింటన్
ఊక దంపుడు అన్నారు...
February 5, 2009 1:33 PM
కందము:-
గొప్ప నిజాయితి పరుడని
అప్పనముగపదవినీయ హస్తపు రాణే
విప్పిరి సంచులు సభలో
నిప్పుకు...చెద పట్టెనయ్య! నేర్పరి యింటన్.
తేటగీతి:-
ఊక దంపుడు పూరణ ఉచితమయ్య.
హస్తినను రాణెచేష్టలు విస్తు పరచె
నఖిల భారత ప్రజలను . అటుల తగునె?
నిప్పునకుచెద పట్టెను నిపుణునింట.
ఫణి ప్రసన్న కుమార్ అన్నారు...
సమస్యా పూరణం:
కురుక్షేత్ర సంగ్రామానంతరం శత్రు శేషము లేని కిరీటి యింట పని లేక మూలన పడియున్న శస్త్రాస్త్రముల సంగతి వినండి.
కందము:-
తుప్పిడె గాంఢీవమునకు
గప్పున సడి లేక గాలి కదలక యుండెన్
అప్పయు నెలుకలు కొరికెను
నిప్పుకు చెద పట్టెనయ్య నేర్పరి యింటన్
February 5, 2009 2:55 PM
కోడీహళ్లి మురళీ మోహన్ అన్నారు...
ఫణీ!
ఆహా. ఎంత నిగూఢంగా రాశావు.
గాండీవానికి తుప్పు పట్టిందా?
వాయువ్యాస్త్రము(గాలి) కదలకుండా ఉన్నదా?
వారుణాస్త్రమును ( అప్పయు= ఆ పయము పయః అంటే నీరు) ఎలుకలు కొరికాయా?
ఆగ్నేయాస్త్రానికి( నిప్పు) చెద పట్టిందా?
భేష్.
February 5, 2009 2:55 PM
నా స్పందన.
తేటగీతి:-
ఫణి ప్రసన్నకు మారుగ పరగె మురళి
మోహన రచన యనునటు ముఖ్యవ్యాఖ్య.
ఎంత చక్కని రచన? మీరింత ఘనత
చూపగలరనుకొనలేదు. సుకవులార.
పుష్యం అన్నారు...
February 6, 2009 6:30 AM
తాగేసిఉన్న అప్పడు, తన ఇంటికి పట్టిన చెదలు వదిలించుకోడానికి, ఇంటిని తగలెయ్యదలచి నిప్పుకోసం వెదికాడు. ఈక్కడ 'నేర్పరి' వ్యంగ్యంగా వాడబడింది.
కం//
అప్పడు అంతట వెదకెను
నిప్పుకు, చెదబట్టెనయ్య 'నేర్పరి' ఇంటన్!
తప్పగ తాగిన అతడిక
నిప్పెట్టతలచె గుడిసెకు, 'నేర్పరి' కాడే!
నా పూరణ కూడా చూడండి:-
కందము:-
అప్పుల సొమ్మది. కాలెను
నిప్పుకు ! చెద పట్టెనయ్య! నేర్పరి! ఇంటన్
గొప్పగు గ్రంధములన్నియు
తిప్పలు పడుచుంటినయ్య! తీర్పగదయ్యా!
మీపూరణ పంపండి. పూరణలు చేస్తూ పాఠకలోకానికి ఆనందామృతాన్నందిస్తున్న మీకు నా ధన్యవాదములు.
రేపు మరో సమస్యా పూరణాంశాన్ని మీ ముందుంచగలను
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
18 comments:
గొప్ప నిజాయితి పరుడని
అప్పనముగపదవినీయ హస్తపు యమ్మే..
విప్పిరి సంచులు సభలో
నిప్పుకు...
అర్ధం కాకపోతే, కాస్త ఓపిక పట్టండి, చదువరి గారు ఇటు వచ్చినప్పుడు ఇంకో రెండొ మూడొ కందాలు జత జేసి విశదపరుస్తారు
హస్తపు రాణే - అని చదువుకోండి
చిన్న సవరణ. మన్నించగలరు.
సమస్యా పూరణం:
కురుక్షేత్ర సంగ్రామానంతరం శత్రు శేషము లేని కిరీటి యింట పని లేక మూలన పడియున్న శస్త్రాస్త్రముల సంగతి వినండి.
కం: తుప్పిడె గాంఢీవమునకు
గప్పున సడి లేక గాలి కదలక యుండెన్
అప్పయు నెలుకలు కొరికెను
నిప్పుకు చెద పట్టెనయ్య నేర్పరి యింటన్
Ramakrishna rao garu!
namaste! mee mail id ivvagalara?
ఫణీ!
ఆహా. ఎంత నిగూఢంగా రాశావు.
గాండీవానికి తుప్పు పట్టిందా?
వాయువ్యాస్త్రము(గాలి) కదలకుండా ఉన్నదా?
వరుణాస్త్రమును ( అప్పయు= ఆ పయము పయః అంటే నీరు) ఎలుకలు కొరికాయా?
ఆగ్నేయాస్త్రానికి( నిప్పు) చెద పట్టిందా? భేష్.
ఫణి ప్రసన్న కుమార్ అన్నారు...
సమస్యా పూరణం:
కురుక్షేత్ర సంగ్రామానంతరం శత్రు శేషము లేని కిరీటి యింట పని లేక మూలన పడియున్న శస్త్రాస్త్రముల సంగతి వినండి.
కందము:-
తుప్పిడె గాంఢీవమునకు
గప్పున సడి లేక గాలి కదలక యుండెన్
అప్పయు నెలుకలు కొరికెను
నిప్పుకు చెద పట్టెనయ్య నేర్పరి యింటన్
February 5, 2009 2:55 PM
కోడీహళ్లి మురళీ మోహన్ అన్నారు...
ఫణీ!
ఆహా. ఎంత నిగూఢంగా రాశావు.
గాండీవానికి తుప్పు పట్టిందా?
వాయువ్యాస్త్రము(గాలి) కదలకుండా ఉన్నదా?
వారుణాస్త్రమును ( అప్పయు= ఆ పయము పయః అంటే నీరు) ఎలుకలు కొరికాయా?
ఆగ్నేయాస్త్రానికి( నిప్పు) చెద పట్టిందా?
భేష్.
February 5, 2009 2:55 PM
నా స్పందన.
తేటగీతి:-
ఫణి ప్రసన్నకు మారుగ పరగె మురళి
మోహన రచన యనునటు ముఖ్యవ్యాఖ్య.
ఎంత చక్కని రచన? మీరింత ఘనత
చూపగలరనుకొనలేదు. సుకవులార.
మీకు సమస్యాపూరణ యందు అభిరుచి ఉన్నయడల, సిలికానాంధ్రా వారి 'సుజనరంజని' మాస పత్రికలో 'పద్యం-హృద్యం' శీర్షికన ప్రతినెలా సమస్యాపూరణ ఉంటుంది (కొన్ని సాంకేతిక కారణాలవలన గత నాలుగు నెలలుగా ఆ పత్రిక ప్రచురింపబడలేదు, కాని ఈ నెల మరల ప్రచురణ మొదలైనది). గమనించగలరు.
http://sujanaranjani.siliconandhra.org
శ్రీ పుష్య మిత్రమా!
కందము:-
శ్రీ సుజన రంజనిన్ గని
ధ్యాసను పూరణములేను తప్పక చేతున్.
నీ సరియె? పుష్యరాగము?
శ్రీసమమగు పద్య హృద్య శీర్షిక కందున్.
ఒక చిత్రకారుడు తను రాజుగారి కోసం తను గీసిన చిత్రపటానికి చెదపడితే బాధ పడుతున్న దృశ్యం:
కం//
గొప్పగ గీసిన పటమున
నిప్పుకు చెద పట్టెనయ్య నేర్పరి ఇంటన్
మెప్పింప రాజునెటులని
కుప్పగ తను కూలిపోయి గోడున ఏడ్చెన్
అగ్ని సప్త ఋషుల భార్యలను మొహించి క్షీణించుట:-
కం. తప్పని యెంచక మోహము
గప్పెనట ముని సతులందు కామము తోడన్
గప్పున క్షీణ బలుండై
నిప్పుకు చెదబట్టెనయ్య, నేర్పరి యింటన్!!
తాగేసిఉన్న అప్పడు, తన ఇంటికి పట్టిన చెదలు వదిలించుకోడానికి, ఇంటిని తగలెయ్యదలచి నిప్పుకోసం వెదికాడు. ఈక్కడ 'నేర్పరి' వ్యంగ్యంగా వాడబడింది.
కం//
అప్పడు అంతట వెదకెను
నిప్పుకు, చెదబట్టెనయ్య 'నేర్పరి' ఇంటన్!
తప్పగ తాగిన అతడిక
నిప్పెట్టతలచె గుడిసెకు, 'నేర్పరి' కాడే!
ఫణి గారి పూరణ, మురళీ మోహన్ గారి వివరణా, అద్భుతం.
కందం పాఠం చదువుకుని, నా మృత్తికా మస్తిష్కం తో నేనూ నిదానంగా ప్రయత్నిస్తాను.
మీరు రవి మాత్రమే అనుకొన్నాను. తప్పుతప్పు. మృత్తిక కూడానని మీ మాటలద్వారా తెలుసుకొన్నాను. ఈ చరాచర జగత్తుకి మూలం మృత్తిక మాత్రమేనని మనకవగతమౌతుంది. అలాంటి మృత్తికా మస్తిష్కంతో మీ రాలోచిస్తూ కందం మీద కలబడితే ఇంకేమైనా వుంటుందా! మీ కందమే! అది మీకందమే! అని చదివినవారనుకోక మానరు తప్పక వ్రాయండి. గుడ్‌లక్.
తాగేసిఉన్న అప్పడు, తన ఇంటికి పట్టిన చెదలు వదిలించుకోడానికి, ఇంటిని తగలెయ్యదలచి నిప్పుకోసం వెదికాడు. ఈక్కడ 'నేర్పరి' వ్యంగ్యంగా వాడబడింది.
కం//
అప్పడు అంతట వెదకెను
నిప్పుకు, చెదబట్టెనయ్య 'నేర్పరి' ఇంటన్!
తప్పగ తాగిన అతడిక
నిప్పెట్టతలచె గుడిసెకు, 'నేర్పరి' కాడే!
Fఎబ్రూర్య్ 6, 2009 6:30 ఆం
పుష్య రాగంబుకందము పొసగెనిందు.
అరగంట పట్టింది అన్నీచదవటానికి
అరగంట ఉచిత వినోదం, కొన్ని జలదరింపులు.
ఫణి గారి పద్యం మొదట చప్పగా అనిపించినా వివరణ చదివినతరువాత అత్యద్బుతమనిపించింది. అదీ అసలైన కవిత్వం అంటే. ఓ పట్టాన సరళంగా ఉండాలి, లోతుగా చూసినపుడు దిమ్మతిరగాలి.
ధన్యవాదములు
ఇప్పటికే అందరూ పూరించేస్తే... నాకు ఇదిగో ఇలా
ఉప్పు సరిపడని ఉడకని
పప్పన్నంలా కుదిరెను... పద్యం చూస్తే
చప్పటి పూరణ వచ్చెను...
ఇప్పటి కిదియే మిగిలెను... ఏమందునొకో!
అప్పటి వఱకూ అసలే
తప్పెరుగని వాని ఎడద తడబడి వడకెన్
కొప్పున మల్లెలు చూడగ
నిప్పుకు చెద పట్టెనయ్య నేర్పరి యింటన్!
అయ్యా! ఇది నా బ్లాగు కాకపోయినా మీ అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకొనేందుకు అనుమతించమని రామకృష్ణా రావు గారిని అభ్యర్తిస్తున్నాను. బాబా గారూ, రవి గారూ మీకు నా చిన్న కవిత ఆనందాన్నిచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
మాస్టారూ, సమస్యకొక చిన్న మార్పు చేసి పూరించాను. యథాతథంగా పూరించలేని నా అశక్తతను మన్నించ గోరుతూ..
చెప్పులు నాకెడు కుక్కల
తప్పుడు కూతల నెదిర్చి తద్బ్లాగరులే
మెప్పును పొందిరి గొప్పగ
నిప్పుకు చెదబట్టదెపుడు నేర్పరి యింటన్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.