ప్రియ బ్లాగ్ మిత్రులారా!
మీలో చాలామంది సమస్యా పూరణలను చాలా చక్కగా సునాయాసంగా చేయ గలుగుతున్నందుకు మీ అందరికీ నా అభినందనలు.
కొందరైతే సమస్యా పూరణ కొంతవరకూ చేసి సరిపోదేమోననే భావనతో నిరాశతో ఉపేక్షిస్తున్నారు.
నామనవిని కాస్త వినండి. విషయాన్ని గ్రహించండి. అదేంటంటే తప్పో ఒప్పో మనం ప్రయత్నం చేసి వ్రాసేయాలి. తప్పైతే ఎక్కడ తప్పు, రైటెలాగ, అని ఆరా తీయడంద్వారా సరిగా నేర్చుకొనే అవకాశముంటుంది. అది మనం వ్రాసినతరువాతనే కదా ఆ అవకాశం కలిగేది. వ్రాయకుండా ఆ అవకాశం మనకు రాదు కదా. అందుకని ఉత్సాహాన్ని పెంచుకోండి. ఒక చిన్న ప్రయత్నం చేయండి చాలు. అద్భుతంగా మీరూ పద్యాలు వ్రాసేయగలుగుతారు.
ఈ రోజు మరో సమస్యాపూరణ కొఱకు అంశాన్ని ఎప్పుడిస్తానా అని ఎదురు చూస్తున్నారా? ఐతే చూడండి
మనం పూరించ వలసిన విషయం లౌకికమే.
----->మణులు మాటలాడె మనసు కరుగ.<----- చూచారు కదా సమస్యని? ఆలస్య మెందుకు పూరించెద్దాం ! మీరు కామెంట్ ద్వారా పంపిన పూరణలు ప్రత్యేకంగా ఒక పోష్టులో వుంచే ప్రయత్నం చేయగలను. మరి మీ కామెంట్ కొఱకు ఎదురు చూడనా?
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
20 comments:
కాస్త లేటు యయ్యె కార్యాల యమునను
అలిగి మంచమెక్కె ఆలి నాదు
తీపి మాట లాడ తిరిగి నాదు ప్రియ
మణులు మాట లాడె మనసు కరుగ
మీరు "లౌ"కికము, అని మంచి ఆధారమే ఇచ్చారు ఔత్సాహికులకు.
"పిలువ బిగువె?" యనుచు పేర్మిబంపరమణీ
మణులు, మాటలాడె- మనసు కరుగ
పిల్లవాని కటను పెళ్లి చూపులయందు;
వధువు యగుట నేడు వరుస కలిసి
దీనికి చదువరి గారు "పద్యాలు కుట్టటం" అని పేరుబెట్టారు
ఇంచుక యొక పద్యము ఇంపుగ పూరణ
సేయుమన్న యెడనె సై యని వెంటనె
కలము గొన్న వారు ఎలమి నెజ్జన శిరో
మణులు మాటలాడె మనసు కరుగన్.
(నాకే నచ్చలేదు. మళ్ళీ ప్రయత్నిస్తాను మరో సారి)
గుణ గానము తగు నెరపి క
రుణ జూడమనిన వినని తరుణమున భృంగా
రుణ బహుమతీయ తరుణా
మణి మాటలాడె ముదముగ మనసులు కరుగన్.
గురువు గారూ నాల్గవ పాదాన్ని నాకు తగ్గట్టుగా కాస్త మార్చుకున్నాను. ప్రస్తుతానికి కందమొకటేగా నాకొచ్చింది అందుకని. తప్పులుంటే సరిదిద్దగలరు.
1. కురుక్షేత్ర సంగ్రామము తరువాత కౌరవ స్త్రీల విలాపం:
ఆట వెలది:
కారు వీరు నీకు పరులు బాంధవులగు
తాల్మి లేక చంప తగునె? అనుచు
ధర్మ రాజు తోడ దాయాదుల నిజ ర-
మణులు మాటలాడె మనసు కరుగ
2. నేడు నిత్య అవసరాల ధరలు పెరగటము గురించి:
ఆట వెలది:
బీద సాదలకును బియ్యము, కూరలు,
వెచ్చములు కొనంగ వెతలనుచును
నాయకాళి తోడ నయముగను రమణీ
మణులు మాటలాడె మనసు కరుగ
(కాని మన నాయకుల మనసులు కరుగుతాయంటారా? సందేహమే)
ఓ చిన్న సవరణ నా పద్యంలో.
ఆటవెలది :-
ఇంచుక యొక సమస్య ఇంపుగ పూరణ
సేయుమన్న యెడనె సై యని వెంటనె
కలము గొన్న వారు ఎలమి నెజ్జన శిరో
మణులు మాటలాడె మనసు కరుగ.
మాదు తల్లినుండి మమ్మల్ని బలిమితో
వేరుసేసి సానవెట్టి మీర
లమ్ముకుందురనుచు నాశ్యర్యముగఁ గలన్
మణులు మాటలాడె మనసు కరుగ
సీసము:
వేణుగానము సోకి వీనులు పులకింప
విరిసె దుద్దులలోని వింత రవ్వ
మరునితో పోరి వగరు పైయెద సెగల
ఎరుపెక్కె కంఠాన వెలయు కెంపు
ఇంపైన సఖుని తలంపులకు నొదిగె
పాపిట ముత్యాళి పరవశమున
జతగాని మరుకేళి జతగూడు తలపుచే
చుంబించె కటియందు కులుకు పచ్చ
చెలుని చూచుకాని చెంతకు పోబోదు
తెలుపలేదు సిగ్గు తమకములచె
రమణి బాధలెల్ల రమ్యముగ మెరిసి
మణులు మాటలాడె మనసు కరుగ
సాన బెట్టు వాడు మేని నరుగదీయ
వజ్రములకు మెరుగు వచ్చు వరకు -
"ప్రాణ మిట్లు తీయ భావ్యమా నీ"కంచు
మణులు మాటలాడె మనసు కరుగ!
- డా.ఆచార్య ఫణీంద్ర
సాన బెట్టు వాడు మేని నరుగదీయ
వజ్రములకు మెరుగు వచ్చు వరకు -
"ప్రాణ మిట్లు తీయ భావ్యమా నీ"కంచు
మణులు మాటలాడె మనసు కరుగ!
- డా.ఆచార్య ఫణీంద్ర
సాన బెట్టు వాడు మేని నరుగదీయ
వజ్రములకు మెరుగు వచ్చు వరకు -
"ప్రాణ మిట్లు తీయ భావ్యమా నీ"కంచు
మణులు మాటలాడె మనసు కరుగ!
- డా.ఆచార్య ఫణీంద్ర
సాన బెట్టు వాడు మేని నరుగదీయ
వజ్రములకు మెరుగు వచ్చు వరకు -
"ప్రాణ మిట్లు తీయ భావ్యమా నీ"కంచు
మణులు మాటలాడె మనసు కరుగ!
- డా.ఆచార్య ఫణీంద్ర
సాన బెట్టు వాడు మేని నరుగదీయ
వజ్రములకు మెరుగు వచ్చు వరకు -
"ప్రాణ మిట్లు తీయ భావ్యమా నీ"కంచు
మణులు మాటలాడె మనసు కరుగ!
- డా.ఆచార్య ఫణీంద్ర
1) నరహరీ! మీ పద్యానికి నా ప్రతిస్పందన:-
క:-
నరహరి మాటలు నమ్మను.
తిరుగుచు గృహమేగ తలుపు తీయునె వనితల్ ?
సరసుడవగుటను నీ సున్
దరమణి తగు మాటలాడె దయ కల్గుటచే.
2) ఆర్యా! వూకదంపుడు మాటలా మీవి? యదార్థాలా! .
క:-
వధువును, వరుడును మదులను
సుధ లొలికే భావగర్భ సూక్తులు వినిరా!
కధలను చెప్పిరి బాగా.
మధువు లొలుక రమణులెచట మాటలనాడున్?
3) {భా} రవీ! అద్భుతంగావుంది భావన.ఐతే కొంచెం మార్పు సూచిస్తున్నాను.
ఆ:-
ఇంచుక నొక పద్య మింపుగా పూరణ
సేయుమన్నయెడనె సైయటంచు
కలము గొన్నవారు కమ్మ కైతల శిరో
మణులటంచు వ్రాయ మన్ననొందు.
4) ఆ{చా}ర్యా!
క:-
ఆత్రేయా మీ కందము
సూత్రమునకు తగిన యట్లు సోభిలు. కించిత్
ఆత్రుత నాల్గో పాదము
సూత్రమునకు బద్ధమవదు చూడుడు సరిగా.
క:-
కనిరా దోషము మీరలు ?
మణి మాటల నాడె ముదము మనసులు కరుగ
న్ననినన్ సరిపోవునుగా?
సునిశితమగు వుషయములను చూడగ వలదే?
5) శ్రీ జిగురు సత్యనార్యా!
ఆ:_
కారుపరులు నీకు వీరు బాంధవులగు.
అనిన మొదటి పాద మద్భుతమగు.
పద్య మంత గొప్ప పరమాద్భుతంబైన
భావ యుక్త మగుచు పరగె నయ్య!
6) రాఘవా! రసరమ్య రచనా విరాజివా!
ఆ:-
మాట మాట లందు మణులనేర్పరచెనో
రాఘ్వాద్భుతమగు రచన చేసె.
తల్లులు మణు లైన పిల్లలు మణులౌను
తలయ జేసె మనకు తెలియ జేసె.
7) ఫణి ప్రసన్న కుమారా! మీ రచనపై నా స్పందన వినండి.
ఆ:-
ఫణిప్రసన్న కొమరు పలుకుల సీసంబు
భావ యుక్త మగుచు పరుగు పెట్టె.
ఏమి గొప్ప నడక1 ఏమి శృంగారమంబు
ఎంత రసిక మణివొ! ఎరుగ నగునె?
8) ఆచార్య ఫణీంద్రా! అద్భుతం మీ భావన.
ఆ:-
వజ్ర భాషణంబు వచ్చియుండును మీకు.
కాని పక్షమందు కరుణ గొలుపు
మణుల భాషణంబు మదికెట్లు దోచునా
చార్య! తెలుపుమయ్య. సరస కవిరొ!
http://turupumukka.blogspot.com/2009/02/blog-post_5329.html
౧) ఆ|
బెట్టుఁ జేసియున్న బ్రేకిన్సుపెక్టర్‌కి
"మణులు మాట లాడె మనసు కఱుగ"
అంచు నేనుఁ జూపె లంచము, సొమ్ము చేఁ
బట్టకతను బండిఁ బట్టు కెళ్ళె!
2) ఆ|
గోపని విడిపించఁ గోరి తానీషాకి
ధనము నిచ్చి నిద్దరి నడుగంగ
"అప్పు యుంటి మతని కంచు" ఆ రామల
క్ష్మణులు మాట లాడె మనసు కఱుగ
- రాకేశ్వర రావు
రాకేశ్వర రావు గారు,
"రామలక్ష్మణులు మాట లాడె మనసు కఱుగ"
అంటే వ్యాకరణం ఒప్పినట్టేనా ?
ఆర్యా!
మీ రడిగిన ప్రశ్న.
ఊకదంపుడు అన్నారు...
రాకేశ్వర రావు గారు,
"రామలక్ష్మణులు మాట లాడె మనసు కఱుగ"
అంటే వ్యాకరణం ఒప్పినట్టేనా ?
17 జనవరి 2010 3:33 pm
సరిపోతుందండి ఐతే మీరన్నట్టు కాదు."రామల"
అనే మూడు అక్షరాలూ ఆటవెలది మూడవ పాదంలో ఉండగా
నాలుగవ పాదంలో" క్ష్మ" అనే అక్షరం వస్తుంది.
క్ష్మ లో మ ఉందికదండీ! అందుకని సరిపోతోంది కదా?
రామకృష్ణారావు గారూ ,
రాముడు మాటలాడె, సీతారాములు మాటలాడిరి అంటాం కదా
అలా మాట లాడె అన్న క్రియను ఇద్దరికి అన్వయించటం సబబేనా అని నా ప్రశ్న
భవదీయుడు
ఊకదంపుడు
ఆర్యా! మీరన్నది యదార్థమే.ఐతే
వారు మాటలాడెను=వారు మాటలాడడం జరిగింది. అనే అర్థం కూడా పాక్షికంగా తీసుకో వచ్చనుకుంటాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.